వివాహం ఎన్ని రకాలు? వివాహ ప్రాముఖ్యత
వివాహం ఎనిమిది రకాలు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం.వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానం బ్రాహ్మ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌కు అలంకరించిన కన్యా దానం చేస్తే దైవ వివా హం. గోమిథునాన్ని వరు ని నుండి స్వీకరించి కన్యాదానం చేస్తే ఆర్ష వివాహం. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుని పూజించి కన్యాదానం చేస్తే ప్రాజపత్య వివాహం. జ్ఞాతులకు, కన్యకు తన శక్తిననుసరించి డబ్బిచ్చి వివాహం చేసుకుంటే అసుర వివాహం. కన్య, వరుడు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే గాంధర్వ వివాహం. కొట్టి బలవం తంగా తనంటే ఇష్టపడని కన్య నపహరించి, వివాహం చేసుకుంటే రాక్షస వివాహం. నిద్రిస్తూ, మత్తులో ఉన్న స్ర్తీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహం చేసుకుంటే అది పైశాచ వివాహం.
బ్రాహ్మవివాహం వలన జన్మించిన పుత్రుడు ముందు పది తరాల వారిని, తరువాత పది తరాలవారిని, తనను మొత్తం 21 తరాల వారిని పాపవిముక్తులను చేస్తాడు. దైవ వివాహం వలన పుట్టినవారు ముందు 7 తరాలవారిని,తరువాతి 7 తరాలవారిని, ఆర్ష వివాహం వలన జన్మించిన పుత్రుడు ముందు 3 తరాల వారిని తరువాత 3 తరాల వారిని, ప్రాజాపత్య వివాహం వలన జన్మించిన పుత్రుడు ముందు 6 తరాలవారిని, తరువాత 6 తరాల వారిని తరింపజేస్తాడు. బ్రాహ్మ, దైవ , ఆర్ష, ప్రాజాపత్య వివాహాల వలన జన్మించిన పిల్లలు బ్రహ్మవర్చస్సుతో శిష్టుల చేత అంగీకరించబడి, మంచి రూపం, సత్వగుణం, ధనం, కీర్తి,సమగ్రభోగానుభవం, ధర్మ నిర్వహణ కలిగి 100 సంవత్సరాల ఆయువు కలిగి ఉంటారు. తక్కిన వివాహాల వలన ఇతరులను ఇబ్బంది పెట్టే క్రోధ స్వభావం గలవారు, అసత్యాలు పలికేవారు. ధర్మద్వేషులు అయిన పుత్రులు జన్మిస్తారు.
అనిందిత వివాహాల వలన ఉత్తమ సంతతి కలుగుతుంది. నిందిత వివాహాల వలన నిందిత స్వభావం గల పుత్రులు జన్మిస్తారు. అందువలన నిందిత వివాహాలు చేయరాదు. వివాహానంతరం భర్తతో సహా అగ్నిహోత్రా దులను నిర్వర్తించడం వలన స్వర్గం లభిస్తుం ది. బ్రాహ్మ వివాహాదులైన వివాహాలలో జనించే పుత్రుడు పితరులను తరింపజేసేవా డౌతాడు. పరమర్షులు వివాహ క్రియకు ఈ కర్మాచరణాన్నీ, ఉత్తమ సంతానాన్నీ ఫలంగా పరిగణించారు. వాస్తవానికి సంతానం మనకోసం కాదు. ఉత్తమ సంతానం వలన రాబోయే తరం సామాజ శ్రేయస్సుకు పాటుపడుతుంది.విద్యావంతులు, వివేకవం తులు అయిన సంతానాన్నే తరువాతి తరంగా సమాజానికి అందించ వలసిన బాధ్యత తల్లిదండ్రుల కుంటుంది.
వివాహం, గర్భాదానం భోగానికి సంకేతంగా భావిం చడం వలన సమాజ కంటకులు జన్మిస్తున్నారు. జ్యోతిషంలో ఆయుర్దాయాన్ని 120 సంవత్సరాలుగా పరిగణిస్తారు. దానిలో ద్వితీయార్థం 60 సంవత్సరాలు పారమార్థిక విషయంలో వినియోగించుకోవాలని, దానికి తగిన ఆశ్రమాలు వానప్రస్థం, సన్యాసమని భారతీయ సంప్రదా యం నిర్వచిస్తుంది. మొదటి అరవై సంవత్సరాల్లో రెండు భాగాలున్నాయి. మొదటి 30 సంవత్సరాలు వ్యక్తి తన విద్యా వృత్తుల్లో అభివృద్ధి చెందడానికి తాను వివేకవంతుడు కావడానికి వినియో గించుకోవాలి. రెండవ 30 సంవత్సరాలు తన పిల్లలు ఉత్తమ పౌరులయ్యేలా వారిని విద్యా వంతులుగా, వివేకవంతులుగా, ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి వినియో గించాలి.
అన్ని గ్రహాల కంటే మందగమనం గల శని అన్ని రాశులలో సంచరిం చడానికి 30 సంవత్స రాలు పడుతుంది. కాబట్టి మొదటి 30 తన విద్య కోసం, రెండవ 30 పిల్లల విద్య కోసం, చివరి 60 ఆధ్యాత్మిక విద్యకోసం పూర్తిగా కేటాయించాలి. తండ్రికి 60 దాటిన తరువాత పిల్లలు తనకు వినాలంటే ఎలాగూ వినరు. కాని వారు స్వయంగా మంచి నిర్ణయాలు తీసుకునే వారుగా అయ్యేలా వారిని తయారు చేయాలి. కుండను కాల్చిన తరువాత మనకు నచ్చిన రీతిలో నగిషీలు చెక్కుతామంటే కుండ పగులుతుంది. గానీ నగిషీలు రావు. కాల్చక ముందే నగిషీలు చెక్కాలి.
అలాగే ిపిల్లవాడు పుట్టకముందునుంచీ సంస్కారవంతునిగా చేయడం వలన సంస్కృతుడే జన్మిస్తాడు. ఉత్తమత్వానికి తల్లిదండ్రులకు జరిగిన జరి గిన వివాహం ప్రాతిపదిక అయితే గర్భా దానం పుట్టేవానికి ప్రథమ సంస్కారం అవు తుంది. గర్భధారణకు ఉత్తమకాలాన్నివినియోగించుకోవడం, గర్భస్థ శిశువుకి ఆయా విషయాల్లో పరిజ్ఞానం కలిగేలా గర్భవతికి మంచి విషయాలు వినిపించడం తండ్రి బాధ్యత. అందువల్లనే ధర్మశాస్త్రాల్లో గర్భిణీపతి ధర్మాల్లో గర్భిణి ఆనందంగా ఉండేలా చూసే బాధ్యతను గర్భిణీపతికి ఇవ్వ డం జరిగింది. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రామునివంటి పిల్లలనే కనాలి గాని, రావణుని వంటి పిల్లలలను కనకూడ దని గుర్తించాలి. వివాహం యెక్క ప్రయోజ నాన్ని గుర్తించి అది సామాజిక బాధ్య త అనీ, వట్టి భోగాంశ కాదని గుర్తించి, సంస్కారాలకు ప్రాధాన్యమిస్తూ రాబోయే తరా న్ని సంస్కారవంతం చేయాల్సిన అవసరం ఉంది.

No comments:
Post a Comment