Thursday, 11 April 2013

భారతీయులు - కాలగణన

కాలం ఎవరికీ అర్థం కాని పదము. కాలము ఎప్పుడు ఆరంభ మైనదో చెప్పలేం కానీ కాలాన్ని ఎలా మానవులు ఎలా లేక్కించారో చెప్పగలము. ఈ సృష్టి పుట్టినరోజే కాలము పుట్టినది. అదే ఉగాది / యుగాది. నిజానికి ఉగాది అంటే - యుగానికి ఆరంభము -అర్థము. "ఉగాది" అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. "ఉ" అంటే నక్షత్రము, "గ" అంటే గమనము. ఈ "ఉగ" అంటే నక్షత్రగమనము అని అర్థము కదా! ఈ నక్షత్రగమనానికి "ఆది" = ఉగాది - ఇదీ శాస్త్రీయ అర్థము.

ఈ సృష్టిలో "శక్తి" అగోచరనీయము. అంటే శక్తి కనపడదు.. కాని దాని తాలూకు ప్రదర్శనని అనుభవముగా చూస్తాము. ఉదా: విద్యుక్చ్చక్తి మనకు కనిపించదు కాని దాని తాలూకు శక్తిని "షాక్" రూపములోగాని, యంత్ర పరికరములు వాడుటలో గానీ చవి చూస్తాము.. శక్తి పదార్థముగా మారిన దశనుంచి "కాలగణన" మొదలవుతుంది. పదార్థము నశించి శక్తిగా మారటముతో కాలగణన ముగుస్తుంది.

ఈ " కాలగణన " విషయములో ప్రపంచములోని అన్ని దేశాలకన్నా మన భారతదేశము చాలా ముందుంది. ఖచ్చితమైన కాలగణన విధానము కనిపెట్టినది కేవలము - ఒక్క భారతదేశమే.

ఈ కాల స్వరూపాన్ని మనము వీక్షించడమే - విశ్వరూప సందర్శనమే! మనము కాల మహాస్వరూపాన్ని లెక్కించడం ఒక మహా సముద్రములో చిన్న చేపపిల్ల సముద్ర పరిమాణాన్ని లెక్కపెట్టేందుకు చేసే ప్రయత్నములా ఉంటుంది. మనము కాలములో ఉన్నామా లేక కాలము మనలో ఉన్నదా అన్న ప్రశ్న అర్థము కాదు. మన శరీరం నశిస్తేగాని కాలము తెలియదు. అదియే "కాలధర్మము".

ఈ చరాచర సృష్టి మొదలై 195 కోట్ల, 58 లక్షల, 85 వేల, 110 సంవత్సరాలని ఋషుల పంచాంగము చెబుతున్నది. అందులో ఇప్పుడు నడిచే కల్పము పేరు శ్వేతవరాహ కల్పం. మన్వంతరం పేరు వైవసత్వ మన్వంతరం. జరిగే యుగము పేరు కలియుగము. ఈ కలియుగము పరిమాణము మొత్తము 4 లక్షల 32 వేల సంవత్సరాలైతే - ఇప్పటిదాకా 5,110 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 4 లక్షల 27 వేల 889 సంవత్సరాలు గడవాలి. గడుస్తుంది కూడా. కానీ అప్పటివరకూ మనము ఈ శరీరాలతో ఉండము.

భారతీయుల కాలగణన :


ఒక లేత తామరాకులో చాలా వాడియైన సూదిని గుచ్చితే ఆ సూదిమొన ఆ తామరాకులో దిగడానికి పట్టే కాలాన్ని "కాష్ఠ" అంటారు. అలాంటి కాష్టలు ఒక "త్రుటి". ఈ 12 త్రుటులు కలిపితే ఒక "కళ". 60 కళలు ఒక నిముషము, 24 నిముషములు కలసి ఒక "ఘడియ". రెండున్నర ఘడియలు కలసి ఒక "ఘంట". 24 ఘంటలు కలసి ఒక రోజు, 30 రోజులు కలిపితే ఒక నెల. 12 నెలలు కలిపితే ఒక సంవత్సరము. ఈపాటికే మీకు అర్థమైఉండవచ్చును - మన భారతీయుల కాలగణన సామర్థ్యం ఏపాటిదో!! ఇదంతా "కాల సూక్ష్మగణన" అంటారు.

ఇక "మహా గణన"కి వస్తే - 365 రోజులు గడిస్తే ఒక సంవత్సరం, ఇలాంటివి 60 సంవత్సరాలు కలిస్తే ఒక సంవత్సర చక్రం. ఇది భూమి సూర్యునిచుట్టూ 60 సార్లు తిరగటానికి పట్టే కాలము. ఎవరైనా 60 సంవత్సరాలు బతికితే వారు సూర్యుని చుట్టూ 60 సార్లు తిరిగారని అర్థం. (అలా అరవై సంవత్సరాలు గడిచినవారికి షష్టిపూర్తి ఉత్సవము చేస్తాము) 4 లక్షల 32వేల సంవత్సరాల కాలాన్ని కలియుగం అంటాము. కలియుగానికి రెట్టింపు అంటే 8 లక్షల 64 వేల సంవత్సరాలు ఉండే కాలము ద్వాపర యుగము. కలియుగానికి మూడురెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు ఉండే కాలము త్రేత్రాయుగము. కలియుగానికి నాలుగు రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక "మహా యుగం" అన్నమాట. అంటే ఈ మహాయుగానికి 43,20,000 సంవత్సరాలన్న మాట. ఇలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక "కల్పం". రెండు కల్పాలు కలిస్తే గడిస్తే "బ్రహ్మకి" ఒకరోజు. అనగా బ్రహ్మదేవుడికి ఒకరోజు ఎంతంటే 43,200*71*14*2 అన్నమాట. అనగా 8,58,81,600 సంవత్సరాలు అని తెలుస్తున్నదిగా.. అలాంటి బ్రహ్మకి 1000 సంవత్సరాల ఆయుష్యు. (అంటే 85881600*365*1000 = 3134678,40,00,000 మానవ సంవత్సరాలని తెలుస్తున్నదిగా) అందులో ఇప్పటికి ఆయనకీ 50 ఏళ్ళు నిండి 51 వ సంవత్సరం, తొలి నెల, తొలిరోజు, తొలి ఘడియలో, తొలి త్రుటిలోని కళలో సగం నడుస్తున్నదంట!

అంతటితో ఆగలేదు మనవాళ్ళు! విష్ణువుకి సంవత్సరాలు గడిస్తే శివునికి ఒకరోజు. అలాంటి శివుడికి సంవత్సరాలు గడిస్తే ఆదిపరాశక్తికి ఒక కనురెప్పపాటు!! చూసారా - మన పోర్వికులు ఎంత దూరము వరకూ లేక్కగట్టారో!.. ఇంత ఖచ్చితముగా, ఇంత దూరముగా ఎవరూ కాలాన్ని అంచనా వేయలేదు.. మనము గర్వించదగ విషయం ఇది..

Saturday, 23 February 2013

శ్రీ గాయత్రీ రామాయణమ్…

ఓమ్ భూర్బు వస్సువః తత్సవితుర్వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియోహోనః ప్రచోదయాత్
తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంవరమ్
నారదం పరిప్రచ్చ వాల్మీకి ర్మునిపుజ్గవమ్
సహత్వా రాక్షసాన్ సర్వరస్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజితస్సమ్యగ్యథేంద్రో విజయీ పురా
విశ్వామిత్రస్స ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం
వత్స రామధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్
తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య స విశాంపతేః
శయనీయం నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్టత
వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యభరణాని చ
భర్తారమనుగచ్ఛ త్యై సీతాయై శ్వశురోదదౌ
రాజా సత్యం ధర్మశ్చ రాజా కులవాతాం కులం
రాజా మతా పితా చైవ రాజా హితకరో నృణాం
నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భ్రతో గురుం
ఉటజే రామమాసీనం జటావల్కలధారిణం
యది బద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిం
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః
భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి
గచ్ఛ శ్రీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం
వయస్యం త్వం కురు క్షిప్రమితో గత్వాద్యరాఘవ
దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమామాణః ప్రియాప్రియే
సుఖదుఃఖసహాః కాలేసుగ్రీవవశగో భవ
వన్ద్యాస్తేతు తపస్సిద్దా స్తపసా వీతకల్మషాః
ప్రష్టన్యాశ్చపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః
న నిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణం
విక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః
ధన్యా దేవాస్స్గంధర్వాస్సిద్ధాశ్చ పరమర్షయః
మమ పశ్యంతి యే నాథం రామం రాజీవలోచనం
మంగళాభిముఖీ తస్య సా తదాసీ న్మహాకవేః
ఉపతస్థే విశాలాక్షి ప్రయాత్ హవ్యవాహనమ్
హితం మహార్థం మృదుపూర్వసంహితమ్
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమమ్
నిశమ్య తద్వాక్య ముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతద బ్రవీత్
ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠస్సం ప్రాప్తోయం విభీషణః
లంకైశ్వర్యం ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం
యో వజ్రపాతాశనిసన్నిపాతా
న్నచుక్షుభే నా పి చచాల రాజా
స రామాబాణాభిహితో భృశార్త
శ్చచాల చాపం చ ముమోచః వీరః
యస్య నిక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః
తం మన్యే రాఘవం వీరం నారాయణమానాయమం
న తే దదృశిరే రామం దహంత మరివాహినీం
మొహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మానా
ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మనేభ్యశ్చ మైథిలీ
బద్ధాంజలిపుటా చేద మువాచాగ్నిసమీపతః

చలనాత్పర్వతేంద్రస్స గణా దేవాశ్చ కంపితాః
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం
దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభాజనం
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర
యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్
తామేవ రాత్రం సీతాపి ప్రసూతా దారకద్వయం
ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపావైః ప్రముచ్చతే.

సర్వదేవతా స్వరూపుడు

ganesh-chaturthi
మహాగణపతి శబ్దం బ్రహ్మస్వరూపం. అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలకు ముందు ఓంకారం ఎలాగైతే ఉంటుందో, అలాగే, అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది. వినాయకుడు ఆదిదేవుడు. సకలదేవతాస్వరూపుడు. ఆందుకే ఆయనకు ప్రథమపూజ.
ఎవరు ఏ దేవతను ఉపాసించినప్పటికీ, ముందుగా గణపతిని పూజించవలసిందేనని నియమం. ఆయన సర్వదేవతాస్వరూపుడు. మంత్రశాస్త్రాలు, ఆ స్వామిలో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, రతీమన్మథులను, భూమీవరాహులను, మిథున దేవతలు ఉన్నారని చెబుతున్నాయి. ఇక, వేదాలకు ఆదిస్వరమైన ఓంకారమే గణపతి గణాలు. వాటి నాయకుడు గణపతి.
గణమయమైన ఈ విశ్వానికి ఆయన అధిపతి కనుక గణపతి. గజ వదనునికి ‘గ’ వర్ణం ప్రీతిపాత్రం. ‘గ’ అనే అక్షరం నుండి మనోవాణీమయమైన ఈ సమస్త జగత్తు ఆవిర్భవించింది. అందుకే భావాత్మకమైన ఈ జగత్తంతా ‘గ’ శబ్దవాచ్యం. ‘ణ’కారం పరతత్త్వానికి సంకేతం. ‘గ’కారం సగుణ సంకేతమైతే, ‘ణ’కారం నిర్గుణ సంకేతం. ఆయన రూపం మనకు ఎన్నో నిగూఢమైన సత్యాలను బోధ పరుస్తుంటుంది.
భారీకాయం
గణ + ఈశః = గణేశః ఈ సమస్త విశ్వానికి పతి కనుక గణపతి. ప్రకృతిలో చరాచరాత్మక సృష్టి మొత్తం ఉన్నట్లుగా లెక్కింపబడి (గణింపబడి) ఎవరైతే పాలిస్తున్నారో ఆ పరమేశ్వరునే ‘గణపతి’ అని అన్నారు. ఆ స్వామి ఈ సమస్త విశ్వమంతటా వ్యాపించి వున్నాడు.
లంబోదరుడు
లంబమైన ఉదరంగలవాడు లంబోదరుడు. ఈ అండపిండ బ్రహ్మాండమంతా ఆయన బోజ్జలోనే నిక్షిప్తమై ఉంది. అందుకే ఆ స్వామికి ఆ పెద్ద పొట్ట. మరొక కథనం ప్రకారం, విష్ణుదత్తమైన నైవేద్యాలతో, శివుడు ఇచ్చిన నైవేద్యాలతో నిండిన పెద్ద పొట్టగలవాడని చెప్పబడుతోంది.
ఏకదంతుడు
‘దంత’ శబ్దం బలవాచకం. ‘ఏక’ అంటే ప్రధానమని అర్థం. ఈ ఏకశబ్దం విశ్వమంతా ఏకస్వరూపంలో వ్యాపించిన మాయాశక్తికి సంకేతం. అదేవిధంగా ఆయన దంతం త్యాగానికి ప్రతీక. ఓ సత్కార్యం కోసం, తనకు చెందిన దానిని త్యాగం చేయడం గొప్ప గుణం. ఆ స్వామి పరశురామునితో జరిగిన ఓ యుద్ధంలో దంతాన్ని ఆయుధంగా ప్రయోగించాడని ఓ కథ. మరొక కథ ప్రకారం, వ్యాసుడు భారతాన్ని చెబుతున్నపుడు, వ్యాసుడు చెప్పినంత వేగంగా భారతాన్ని లిఖిస్తున్న వినాయకుని ఘంటం విరిగిపోయిందట. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగిస్తూ భారతాన్ని ముగించాడట.
చేటల వంటి చెవులు
చేటల వంటి చెవులు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఆయన తన విశాలమైన చెవుల ద్వారా భక్తుల కష్టాలను ఓపిగ్గా విని, వారికి ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకాకుండా కాపాడుతుంటాడు. అదేవిధంగా అతి తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా వినమని ఆయన చెవులు మనకు చెబుతున్నాయి.
చతుర్భుజుడు
గణపతి అనంతమైన రూపాలను ధరించిన స్వామి. అందులో చతుర్భుజరూపం ఒకటి. ఆయన నాలుగు చేతులు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విథ పురుషార్థాలను సూచిస్తున్నాయి. గణపతి, దేవలోకం, మానవలోకం, అసురలోకం, నాగాలోకాలను నియమిస్తున్నాడని ప్రతీతి.
ఆయుధధారి
అదేవిధంగా ఆయా సందర్భాలనుబట్టి ఎన్నో రూపాలను ధరించిన గణేశుడు రకరకాల ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తుంటాడు. ఆయన చేతులలోని ఆయుధాలు కూడ ఎన్నో లోలైన విషయాలను విడమరచి చెబుతున్నట్లుగా గోచరిస్తుంటాయి.
శ్లోకం:
తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య
నిను బ్రస్తుతి జేసెద నేకదంత మా
వలపలి చేతిగంటమున
వాక్కుననెప్పుడు బాయకుండు మా
తలపుల లోన నీవెగతి దేవ,
వినాయక, లోకనాయకా
శివపుత్రుడా! అవిఘ్నమస్తు అంటూ మొట్టమొదటగా నీకు మొక్కుతున్నాను. నాకు చక్కని ఫలితాలను ఈయవయ్యా. నిన్ను పొగుడుతున్నాను. ఓ ఏకదంతా! నా కలంలో, వాక్కులో నువ్వే నెలకొని వుండు. నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఓ దేవా! వినాయకా! లోక నాయకా!!
పాశం: పాశాన్ని పై ఎడమ చేత్తో పట్టుకుని దర్శనమిస్తుంటాడు. రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని స్వామివారి చేతిలోనున్న పాశం మనకు అవగతపరుస్తోంది. ఈ పాశం మనకు ఆయన అవతారాలలో పలువిధాలుగా గోచరిస్తుంటుంది. కొన్ని విగ్రహాలలో నాగపాశంగా కనబడుతుంటుంది.
అంకుశం: స్వామి చేతిలో నున్న మనకు అంకుశం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది.
యుద్ధగొడ్డలి: ఇది మనలోని చెడుభావాలను దూరంగా ఉంచమని చెబుతోంది.
గండ్రగొడ్డలి: ఈ ఆయుధాన్ని గణేశునికి పరశురాముడు బహుకరించాడని ప్రతీతి. పరశురామునికి ఈ ఆయుధాన్ని శివుడు బహుకరించాడు. వీర, సిద్ధి, విఘ్న, హేరంబ, నృత్య గణపతుల చేతుల్లో ఈ గండ్రగొడ్డలి చూడగలం.
విల్లు: ఒకసారి పార్వతీదేవి దగ్గరనుంచి శివుని విల్లు పినాకమును తీసుకున్న గణపతి, దానిని భూమిపైకి విసిరేసాడని ఒక కథ. అలా ఆయన విల్లంబును ధరించాడని ప్రతీతి. ఒక్కొక్కసారి ఆయన చేతిలో చెఱకుగడ విల్లును కూడ చూడగలం. ఈ విల్లు చెడుకు దూరంగా ఉండమని మనకు చెబుతోంది.
బాణం: స్వామి చేతిలోని బాణం, మనలను చీకటి నుండి వెలుగులోకి పయనించమని చెబుతోంది. ఒకసారి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళిన శివుడు, గణపతిని స్మరించకుండానే ఆ పనికి ఉద్యుక్తుడయ్యాడు. ఫలితంగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ శివుని చేతిలో త్రిపురాసురుడు హతమవడం లేదు. కొంతసేపటి తర్వాత విషయాన్ని గ్రహించిన శివుడు గణేశుని ప్రార్థించగా, ఆయన ‘ఓం’ అనే బీజమంత్రాన్ని బాణంపై వ్రాసి ప్రయోగించామన్నాడట. శివపరమాత్మ అలాగే చేయగా త్రిపురాసుర సంహారం విజయవంతంగా జరిగింది.
కత్తి: స్వామివారి గంధక ఖడ్గప్రియ అనే కత్తి మన మనసులోని తలెత్తే చెడు ఆలోచలనలను మొగ్గలోనే తుంచేయమని చెబుతోంది.
గునపం: వ్యవసాయదారులు ఉపయోగించే గునపం పలువిధాలుగా ఉపయోగపడుతుంది. తద్వారా పంటలు బాగా పండించుకునేందుకు వీలవుతుంది. అలాగే మనలోని భావనలను ఆలోచన అనే గునపంతో తిరగేసి జీవితంలో పురోభవృద్ధి సాధించమని గునపము పేర్కొంటుంది.
శతధరవరాయుధం: ఈ ఆయుధం మంచి చెడులను వేరు చేసి చూడమంటోంది.
గద: వినాయకుడు గణాధిపత్యం పొందకమునుపే పార్వతీదేవి ఆజ్ఞప్రకారం, ఆమె భవనానికి కాపలాకాస్తూ శివగణాలతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఆయన చేతిలో గదాయుధం ఉంది. ఈ ఆయుధం సమస్యలను ఎదిరించి నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
త్రిశూలం: వీర గణపతి చేతిలో త్రిశూలాన్ని చూడగలం. ఈ త్రిశూలం ఆపదలు, లేక విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.
డాలు: ఈ ఆయుధం ఇతరులు మనకు చేసే చెడు నుంచి రక్షించుకోమని సూచిస్తోంది.
మనకు వినాయకుడు మూశికవాహనుడుగానే తెలుసు. కానీ ఆయనకు తేలు, పాము, రథం,వంటి వాహనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
మూషికవాహనుడు
పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు సౌభారి అనే ముని ఆశ్రమానికి వచ్చి వెళ్తుండేవాడు. క్రౌంచునికి గంధర్వ లోకం కంటే సౌభారి ఆశ్రమమే చాలా బాగా నచ్చుతుండేది. అందుకు కారణం మున్యాశ్రమం కాదు. సౌభారి మహర్షి భార్య మనోమయి. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్న క్రౌంచుడు, సమయం, సందర్భం కోసం వేచి చూడసాగాడు. ఆ సమయము రానే వచ్చింది. ఒకరోజు ఆశ్రమమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రిస్తున్న మనోమయిని క్రౌంచుడు భుజాన వేసుకుని పరుగులు తీయసాగాడు. చటుక్కున మేల్కొన్న మనోమాయి కేకలు వేయడంతో, ఆశ్రమంలోని శిష్యగణమంతా ఒక్క ఉదుటున లేచి మనోమయిని కింద పడేసి పారిపోబోతున్న క్రౌంచిని పట్టుకుని గురువుకు అప్పగించారు. సౌభారి మహర్షికి జరిగిన సంగతి అంతా అర్థమైంది. గురుపత్నిని తల్లిలా భావించక, కామాంధ కారంతో ప్రవర్తించిన క్రౌంచుని గజముఖంతో నిశాచరుడవై బ్రతుకును వెళ్ళదీయమని శపించాడు. అప్పటికీ సౌభరి మహర్షి కోపం చల్లారక పోవడంతో రాక్షస జన్మనుంచి విముక్తి పొందినప్పటికీ ఎలుకవలె మిగతా జన్మలన్నీ వేల్లదీయక తప్పదని శపించాడు. గజముఖ రూపునిగా మారిన క్రౌంచుడు, శివుని ప్రార్థించి అనేక వరాలను పొంది, దేవతలను బాధించసాగాడు. దేవతలు విఘ్నవినాయనకుని దగ్గర మొరపెట్టుకోవడంతో గజముఖుని సంహరించాడు. అయినప్పటికీ గజముఖుని రూపం నుంచి విముక్తి పొందిన క్రౌంచుడు సౌభరి మహర్షి మరో శాపం ప్రకారం, ఎలుకగా మారి, వినాయకుని శరణు వేడి, ఆయన వాహనంగా స్వామి సేవను చేసుకుని, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇంకా పలు పురాణాలలో ఈ మూషిక వాహనం కథ రకరకాలుగా గోచరిస్తుంటుంది. అణిగిమణిగి ఉండటమే అత్యుత్తమం అన్న విషయాన్ని వినాయకుని మూషికవాహనం మనకు తేటతెల్లం చేస్తోంది.
రథా రూఢుఢు
గణేశపురాణంలో వినాయకుడు రథంపై ఆసీనుడై ఉండగా, ఆ రథాన్ని ఎలుక లాగుతోందన్నట్లుగా ఉంది.
సింహవాహనుడు
పంచముఖ హేరంబ గణపతి సింహవాహనుడు.
మయూర వాహనుడు
ఓ రాక్షసుని నెమలివాహనంపై వచ్చి వినాయకస్వామి సంహరించాడు. అందుకే ఆయన్ని మయూరేశ్వరుడు అని కూడ పిలుచుకుంటారు.
సర్వవాహనుడు
అత్యంత కిరాతకుడైన ఓ రాక్షసుని సంహరించేందుకై వినాయకుడు సర్పవాహనంపై అరుదెంచాడని ముద్గలపురాణం తెలియజేస్తోంది.
ఆశ్వవాహనుడు
రాక్షస సంహారం కోసం ఒకానొకప్పుడు గణపతి గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చాడట.
గజవాహనుడు
ఒకానొక సమయంలో గణపతికి తండ్రి శివునీతోనే పోరు మొదలవుతుంది. అప్పుడా స్వామి గజవాహనంపై తండ్రి ఎదురుగా వచ్చి నిలబడ్డాడని కథ. ఇలా ఆ స్వామి పలురకాలైన వాహనాలపై ఆసీనుడై కనబడుతుంటాడు. తేలువాహనంపై, చిలుకవాహనంపై, మేషవాహనంపై కూడ ఆయన్ని దర్శించుకోగలరు.

అవధూత గీత

పెద్దలు మనకోసం ఎన్నో అపురూపమైన విషయాలను గ్రంథస్తం చేశారు. అటువంటి గ్రంథాలు మన దగ్గర లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కానీ, మనమే వాటిని పట్టించుకోవడం లేదు. అటువంటి అపురూపమైన గ్రంథావళిలో ‘అవధూత గీత’ ఒకటి.
‘అవధూత’ అంటే ఎవరు?
బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?
కాదు! కానే కాదు!
ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.
అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?
త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.
ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?
కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.
త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?
అవధూత గీతయే అష్టమాధ్యాయంలో ‘అవధూత’ పదంలోని నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరం శ్లోక ఆరంభ అక్షరంగా, నాలుగు అక్షరాలకు నాలుగు శ్లోకాలలో అవధూత లక్షణాలను వ్యక్తం చేసింది:
ఆశాపాశ వినిర్ముక్తః
ఆదిమధ్యాన్త నిర్మలః
ఆనందే వర్తతే నిత్యం
ఆకారం తస్య లక్షణమ్ (8-6)

ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.
వాసవా వర్జితా యేవ
వ్యక్తవ్యం చ నిరామయమ్
వర్తమానేషు వర్తేత
వకారం తస్య లక్షణమ్ (8-7)

ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమై ఉన్నది.
ధూర్ది ధూసర గాత్రాణి
ధూత చిత్తో నిరామయః
ధారణ ధ్యాన నిర్ముక్తో
ధూకార స్తస్య లక్షణమ్ (8-8)

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.
తత్త్వ చిన్తా ధృతా యేవ
చిన్తా చేష్టా వివర్జితః
తమోహంకార నిర్ముక్తః
తకార స్తస్య లక్షణమ్ (8-9)

తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.
అవధూత గీత అద్వయ సత్తా స్వరూపమై భాసిల్లే ఆత్మస్థితిని ప్రతిబోధించే జ్ఞాన బోధయేకాక ఈ గీత రచన చక్కని పదజాలంతో సంగీతపరంగా శ్రవణానందంగా ఉంటుంది. మచ్చుకు,
తత్త్వమస్యా ది వాక్యేన
హ్యాత్మాహి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్భూయా
దనృతం పజ్ఞ్చాభౌతికమ్ (1-25)

‘తత్త్వమసి’ ఆది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదించబడినది. అసత్యమై పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కానేరాదని వేదం చెబుతోంది.
అనంత రూపం నహి వస్తు కిజ్ఞ్చత్
తత్త్వ స్వరూపం నహి వస్తు కిజ్ఞ్చత్
ఆత్మైక రూపం పరమార్థ తత్త్వం
న హింస కొ వాపి న చాస్య హింసా (1-29)

ఆత్మ తప్ప వేరైన వస్తువేదీ నాశనము లేనిది కాదు. ఆత్మైక రూపమైన పరమాత్మతత్త్వం ఒక్కటే నాశనం లేనిది. ఇది దేనిని హింసించేది కాదు. ఇది దేని చేతను హింసింపబడేది కాదు.
నషండో న పుమాన్ న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానందో వా నిరానందం ఆత్మానం మన్యసేకథమ్ (1-47)

నువ్వు నపుంసకుడవు కావు. పురుషుడవూ కావు. స్త్రీవి కావు. జ్ఞానమూ కావు. కల్పనవూ కావు. నువ్వు ఆనందమూ కావు. నిరానందమూ కావు. అలాంటి ఆత్మనైన నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు?
న తేచ మాతాచ పితాచ బందుః
న తేచ పత్నీ సుతాశ్చ మిత్రమ్
న పక్షపాతో న విపక్ష పాతః
కథం హి సంతాప పరోసి చేతః

ఓ చిత్తమా! నీకు తల్లీ, తండ్రి, బంధువు, భార్య, బిడ్డ, మిత్రుడు ఎవరూ లేరు. పక్షపాతం ఉండుట, లేక పోవుట రెండూ లేవు. అలాంటి నీకు సంతాపం ఎలా కలుగుతుంది?
విన్దతి విన్దతి నహినహి యత్ర
ఛందో లక్షణం నహి నహి యత్ర
సమరస మగ్నో భావిత పూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః (4-25)

అవధూత ఎక్కడా దేనిని పొందడు. ఛందో లక్షణాలను ఎరుగడు. సమరసంలో మునిగినవాడై, భావం చేత పవిత్రుడై పరమాత్మ తత్త్వాన్ని చక్కగా చెబుతాడు.
ననురూప విరూప విహీన ఇతి
నను భిన్న విభిన్న విహీన ఇతి
నను సర్వ విసర్వ విహీన ఇతి
కిము రొదిషు మానసి సర్వసమమ్ (5-11)

నువ్వు రూపారూపాల లేనివాడివి, భేదాభేదాలు లేనివాడివి. సర్వాసర్వములు లేనివాడివి. సర్వసముడవైన నీకు దుఃఖం ఎందుకు?
తైలొక్య జననీ ధాత్రీ,
సా భగీ నరకో ధృవం
తస్యాం జాతో రతస్తత్ర,
హాహా సంసార సంస్థితిః (8-15)

స్త్రీ ముల్లోకాలకీ కన్నతల్లి. ధరించేది. ఆమె భగసౌఖ్యం ఇస్తున్నపుడు నరకమే అవుతున్నది. ఇదినిజం. ప్రాణుల పుట్టుకస్థానమే రతిస్థానం. అవడము కడు శోచనీయం. అయ్యయ్యో! ఇదీ సంసారం.
మద్యపానం మహాపాపం,
నారీసంగ స్తథైవచ
తస్మాద్ద్వయం పరిత్యజ్య,
తత్త్వ విష్ఠో భవెన్మునిః (8-26)

మద్యపానం మహాపాపం. స్త్రీ సంగమం కూడ అలాంటిదే. ఈ రెండిటినీ వదలి తత్త్వనిష్ఠలో ఉన్నవాడుమౌని అనబడతాడు.
ఇంతటి అపూర్వమైన ఆధ్యాత్మిక గ్రంథం ఉచిత ప్రచారం పొందక అజ్ఞాతంలో ఉండిపోవడం కడు శోచనీయం. మన దౌర్భాగ్యం. ఆణిముత్యాల వంటి ఈ ఇటువంటి గ్రంథాల పఠనం ఆవశ్యం.

నిర్వాణషట్కమ్

మనోబుద్ధ్యాహంకార చిత్తాని నాహం
నశ్రోత్రం – నజిహ్వ – న చఘ్రాణ నేత్రం
నచ వ్యోమ – భూమిర్నతేజోనవాయు
శ్చిదానంద రూపం శివోహం శివోహం
మనస్సు – బుద్ధి – అహంకారం చిత్తం నేను కాదు. కర్ణములు – రుచి – వాసన – ఇది కూడా నేను కాదు. ఆకాశం – భూమి – తేజస్సు – వాయువు – జడము ఇవియు నేను కాదు. నేను  యొక్క స్వరూపము శివతత్త్వము. ఆ నేను శివుడనే!
అహం ప్రాణసంజ్గో నవైంపం ఇచ్చవాయు
ర్నవాసప్తధాతు ర్నవాప ఇచ్చకోశః
నవాక్ పాణిపాదౌ నచోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం
నేను పంచప్రాణాలు కాను – పంచ వాయువులు కాను – రక్త – మాంస – మేధో – ఆస్థి – మజ్జ – శుక్లం – రసం – నేను కాదు. పంచకోశాలు నేను కాదు – వాక్ – పాణి పాదాలు నేను కాదు – ఉపస్థలం కాను. నేను కేవలము చిదానంద రూపుడను శివుడను నేను!
నపుణ్యం నపాపం – నసౌఖ్యం – నదుఃఖం
నమంత్రాన తీర్థం – నవేదా – నయజ్ఞః
అహం భోజనం నైవ – భోజ్యంభోక్తా
శ్చిదాననంద రూపః శివోహం శివోహం
నాకు పుణ్యం లేదు – పాపం లేదు. సుఖం లేదు. దుఃఖం లేదు. మంత్ర జపం లేదు. తీర్థసేవలేదు. వేదములు లేవు – యజ్ఞములు లేవు. అన్నం నేను కాదు – భోజనం నేను కాదు – భోజ్యం – భోక్తా నేను కాదు. నేను కేవలం చిదానంద రూపుడను ఆ శివుడను నేనే.
నమే ద్వేషరాగా – నమే లోభమోహో
మదోమేనైవ మాత్సర్యభావః
నధర్మో నచార్ధో నకామో నమోక్షః.
శ్చిదానందరూపః శివోహం శివోహం
నాకు రాగద్వేషాలు లేవు. లోభామోహాలు లేవు. మదమాత్సర్యాలు లేవు. ధర్మార్థకామ మోక్షాలు లేవు. నేను కేవలం చిదానంద రూపుడను, శివుడనే శివుడని నేను.
నమృత్యుర్నశజ్కా నమేజాతిభేధః
పితానైవ మేనైవ మాతానజహ్మ
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య
శ్చిదానందరూపః శివోహం శివోహం
నాకు మృత్యువు లేదు. భయం లేదు. జాతి భేదాలు లేవు. తండ్రి, తల్లి భావన లేదు. బంధువులు లేరు. మిత్రులు లేరు. గురువు లేడు – శిష్యులు లేరు. నేను చిదానంద రూపుడను శివుడను. ఆ శివుడను నేను.
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వే నిర్ధియాణాం
నవాబింధనంనైవ ముక్తిర్నబంధః
శ్చిదానందరూపం శివోహం శివోహం
నేను నిర్వికల్పుడను – వికల్పరహితుడను. నేను నిరాకారుడను. సర్వవ్యాపకుడను. అన్ని ఇంద్రియములతో నాకెప్పుడు సంబంధం లేదు.  బంధం లేదు. ముక్తి లేదు – నేను చిదానందరూపుడను శివుడను. ఆ శివుడను నేనే!
శంకరాచార్యుల రచనలలో నిర్వాణషట్కమ్ ఒకటి. దీనికి ఆత్మషట్కమ్ అనే పేరు కూడ ఉంది. నిర్వాణం అంటే ముక్తి అంటే ఆరు. “నేను” నిజస్వరూపాన్ని నిర్వాణషట్కమ్ లో శంకరులు వివరించారు.

సంస్క్రుతి


‘బ్రాహ్మణుడు’ అంటే ఎవరు?


‘బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః’ అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు.
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
       నిజముశూద్రుకంటె నీచతముడు
       సత్య శౌచధర్మశాలి శూద్రుండయ్యు
       నతడు సద్ద్విజుండ యనిరి మునులు – ‘శ్రీమహాభారతం’
సీ|| ఎవ్వడు సత్యంబు నెప్పుడు బల్కు, హింసావిదూరుడు గురుజనహితార్థి
       యింద్రియంబులనోర్చి ఎల్లవారల దనయట్ల జూచు ధర్మాభిరతుడు
       కామంబు తగులండు కర్మంబులారును, సముచిత సంప్రయోజతనొనర్చు
       అట్టి పుణ్యాత్ముని అనఘబ్రాహ్మణుడని యనిశంబు గీర్తింతురమరవర్యు
ఆ|| లార్జవంబు శమము నధ్యయవంబును
       పరమధనముసువ్వె బ్రాహ్మణునకు
       ధర్మగతికి ననియు తగు సాధనంబులు
       వేదవిహితముఖ్యవిధులు నెనయె – శ్రీమహాభారతం – అరణ్యపర్వం
శ్లో|| జన్మవా బ్రాహ్మణోజ్ఞేయః, సంస్కారైః ద్విజ ఉచ్యతే!
       విద్వత్వాచ్చాపి విప్రత్వం త్రిభిశ్శోత్రియ ఉచ్యతే|| – ‘ధర్మశాస్త్రం’
“చాతుర్వర్ణం మయాసృష్టం గుణభేద విభాగశః” – భగవద్గీత
శూద్రునకు జన్మించినవారు శూద్రుడు కాగలడుగాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. వేదమూ, పురాణాలు, శ్రుతులు, స్మృతులు కూడా ఇదేమాట చెబుతున్నాయి. బ్రాహ్మణుని “ద్విజుడు” అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సారులు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగింది. రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది.
బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు. బ్రాహ్మణుడుగా జీవించటం గొప్ప!
సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మమూ ఈవిషయాన్ని నొక్కిచెప్పాయి.
సమస్త బ్రాహ్మణకులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి చెప్పిన శ్రీ విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి శ్రీరాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య – కూర్మ – వరాహ – నారసింహాది అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు.
వేదాలలో ఎక్కడా కులప్రసక్తి లేదు.
జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూచుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకొనకూడదు. బహుభార్యాత్వాన్ని కలిగి వుండరాదు. సుఖాభిలాష వుండకూడదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం సేవించకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశప్రయాణం చేయకూడదు. ఇతర ఆహారపదార్ధాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్ధం చెప్పకూడదు. ధనాన్ని, సుఖాలనూ అభిలషించకూడదు. స్త్రీలవంక నిశితంగా చూడకూడదు. ఆహారాలనూ, వస్తువులనూ, కాఫీ వంటి విదేశ పానీయాలను ముట్టకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించకూడదు. ప్రాణులను కర్రతోగాని, రాయితోగాని కొట్టకూడదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం (పిలక) లేకుండా వుండకూడదు. సినిమా నాటకాలు మున్నగునవి చూడకూడదు. ఏకపత్నీవ్రతాన్ని తప్పక పాటించాలి. సర్వజన శాంతి సుఖాల కోసం దేవుని ప్రార్థించాలి. దైవ ప్రార్ధనలో తన స్వార్ధం విడచి జనహితాన్ని కోరుకోవాలి. జనహితంకోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస్సు, మాట, శరీరం, పని లోకహితార్ధమై వుండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి – బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించి నమస్కరించాలి.
ధార్మిక లక్షణాలున్నవారెవరైనా బ్రాహ్మణులే!
‘బ్రాహ్మణ్యం’ కులసంకేతపదం కాదు. గుణసంకేత పదం.
‘బ్రాహ్మణాయ నమోనమః’
బ్రహ్మజ్ఞానాయ నమోనమః

అవధూత గీత

పెద్దలు మనకోసం ఎన్నో అపురూపమైన విషయాలను గ్రంథస్తం చేశారు. అటువంటి గ్రంథాలు మన దగ్గర లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కానీ, మనమే వాటిని పట్టించుకోవడం లేదు. అటువంటి అపురూపమైన గ్రంథావళిలో ‘అవధూత గీత’ ఒకటి.
‘అవధూత’ అంటే ఎవరు?
బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?
కాదు! కానే కాదు!
ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.
అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?
త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.
ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?
కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.
త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?
అవధూత గీతయే అష్టమాధ్యాయంలో ‘అవధూత’ పదంలోని నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరం శ్లోక ఆరంభ అక్షరంగా, నాలుగు అక్షరాలకు నాలుగు శ్లోకాలలో అవధూత లక్షణాలను వ్యక్తం చేసింది:
ఆశాపాశ వినిర్ముక్తః
ఆదిమధ్యాన్త నిర్మలః
ఆనందే వర్తతే నిత్యం
ఆకారం తస్య లక్షణమ్ (8-6)

ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.
వాసవా వర్జితా యేవ
వ్యక్తవ్యం చ నిరామయమ్
వర్తమానేషు వర్తేత
వకారం తస్య లక్షణమ్ (8-7)

ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమై ఉన్నది.
ధూర్ది ధూసర గాత్రాణి
ధూత చిత్తో నిరామయః
ధారణ ధ్యాన నిర్ముక్తో
ధూకార స్తస్య లక్షణమ్ (8-8)

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.
తత్త్వ చిన్తా ధృతా యేవ
చిన్తా చేష్టా వివర్జితః
తమోహంకార నిర్ముక్తః
తకార స్తస్య లక్షణమ్ (8-9)

తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.
అవధూత గీత అద్వయ సత్తా స్వరూపమై భాసిల్లే ఆత్మస్థితిని ప్రతిబోధించే జ్ఞాన బోధయేకాక ఈ గీత రచన చక్కని పదజాలంతో సంగీతపరంగా శ్రవణానందంగా ఉంటుంది. మచ్చుకు,
తత్త్వమస్యా ది వాక్యేన
హ్యాత్మాహి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్భూయా
దనృతం పజ్ఞ్చాభౌతికమ్ (1-25)

‘తత్త్వమసి’ ఆది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదించబడినది. అసత్యమై పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కానేరాదని వేదం చెబుతోంది.
అనంత రూపం నహి వస్తు కిజ్ఞ్చత్
తత్త్వ స్వరూపం నహి వస్తు కిజ్ఞ్చత్
ఆత్మైక రూపం పరమార్థ తత్త్వం
న హింస కొ వాపి న చాస్య హింసా (1-29)

ఆత్మ తప్ప వేరైన వస్తువేదీ నాశనము లేనిది కాదు. ఆత్మైక రూపమైన పరమాత్మతత్త్వం ఒక్కటే నాశనం లేనిది. ఇది దేనిని హింసించేది కాదు. ఇది దేని చేతను హింసింపబడేది కాదు.
నషండో న పుమాన్ న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానందో వా నిరానందం ఆత్మానం మన్యసేకథమ్ (1-47)

నువ్వు నపుంసకుడవు కావు. పురుషుడవూ కావు. స్త్రీవి కావు. జ్ఞానమూ కావు. కల్పనవూ కావు. నువ్వు ఆనందమూ కావు. నిరానందమూ కావు. అలాంటి ఆత్మనైన నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు?
న తేచ మాతాచ పితాచ బందుః
న తేచ పత్నీ సుతాశ్చ మిత్రమ్
న పక్షపాతో న విపక్ష పాతః
కథం హి సంతాప పరోసి చేతః

ఓ చిత్తమా! నీకు తల్లీ, తండ్రి, బంధువు, భార్య, బిడ్డ, మిత్రుడు ఎవరూ లేరు. పక్షపాతం ఉండుట, లేక పోవుట రెండూ లేవు. అలాంటి నీకు సంతాపం ఎలా కలుగుతుంది?
విన్దతి విన్దతి నహినహి యత్ర
ఛందో లక్షణం నహి నహి యత్ర
సమరస మగ్నో భావిత పూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః (4-25)

అవధూత ఎక్కడా దేనిని పొందడు. ఛందో లక్షణాలను ఎరుగడు. సమరసంలో మునిగినవాడై, భావం చేత పవిత్రుడై పరమాత్మ తత్త్వాన్ని చక్కగా చెబుతాడు.
ననురూప విరూప విహీన ఇతి
నను భిన్న విభిన్న విహీన ఇతి
నను సర్వ విసర్వ విహీన ఇతి
కిము రొదిషు మానసి సర్వసమమ్ (5-11)

నువ్వు రూపారూపాల లేనివాడివి, భేదాభేదాలు లేనివాడివి. సర్వాసర్వములు లేనివాడివి. సర్వసముడవైన నీకు దుఃఖం ఎందుకు?
తైలొక్య జననీ ధాత్రీ,
సా భగీ నరకో ధృవం
తస్యాం జాతో రతస్తత్ర,
హాహా సంసార సంస్థితిః (8-15)

స్త్రీ ముల్లోకాలకీ కన్నతల్లి. ధరించేది. ఆమె భగసౌఖ్యం ఇస్తున్నపుడు నరకమే అవుతున్నది. ఇదినిజం. ప్రాణుల పుట్టుకస్థానమే రతిస్థానం. అవడము కడు శోచనీయం. అయ్యయ్యో! ఇదీ సంసారం.
మద్యపానం మహాపాపం,
నారీసంగ స్తథైవచ
తస్మాద్ద్వయం పరిత్యజ్య,
తత్త్వ విష్ఠో భవెన్మునిః (8-26)

మద్యపానం మహాపాపం. స్త్రీ సంగమం కూడ అలాంటిదే. ఈ రెండిటినీ వదలి తత్త్వనిష్ఠలో ఉన్నవాడుమౌని అనబడతాడు.
ఇంతటి అపూర్వమైన ఆధ్యాత్మిక గ్రంథం ఉచిత ప్రచారం పొందక అజ్ఞాతంలో ఉండిపోవడం కడు శోచనీయం. మన దౌర్భాగ్యం. ఆణిముత్యాల వంటి ఈ ఇటువంటి గ్రంథాల పఠనం ఆవశ్యం.

పంచామృతం అంటే?

ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
పంచామృతం అంటే….
పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!
ఆవు పాలు
ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.
పెరుగు
పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయం పూట గుడికి వెళ్ళి పెరుగుతో పంచామృతం తీసుకోవటం ఈ విధంగా చూసినా మంచిదే!
నెయ్యి
మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.
తేనె
వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది.

చక్కని తల్లికి చాంగుభళా!

తిరుమల కొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు. ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలిమేలి మంగాపురం)లో కొలువుదీరివున్నారు. ప్రతీ ఏటా తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగం ఆ చివరిరోజు పంచమితీర్థం కూడా ఉంటుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. లక్షలాది భక్తులు ఈ రోజున అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకుంటారు. అయితే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక పురాణ గాథ ఉంది.
పూర్వం నైమిశారణ్యంలో మునులందరూ కలసి యజ్ఞాలు చేస్తుండగా, అక్కడికి నారదమహర్షి వచ్చి, “ఈ యాగం ఎవరికోసం చేస్తున్నారు” అని అడిగి, “చేస్తే చేశారు గానీ, దేవతలలో గొప్పవారు ఎవరో ముందుగా తెలుసుకుని, ఈ యాగఫలాన్ని వారికి అర్పించండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు భృగుమహర్షి, ఎవరు గొప్పో తేల్చాలని ముందుగా బ్రహ్మలోకానికి, ఆ తరువాత కైలాసానికి వెళ్ళి బ్రహ్మదేవుడు, శివుడు గొప్పవాళ్ళి కాదని నిర్ణయించి చివరకు వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా నిరాశకు లోనై, కోపం పట్టలేని భృగుమహర్షి శ్రీమహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నుతాడు. అది చూసిన శ్రీమహాలక్ష్మీ ఆవేశంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోయి కొల్హాపురం చేరుకుంది. ఆమెను వెదుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి కొల్హాపురంలో శ్రీమహాలక్ష్మీ ఉందని తెలుసుకుని అక్కడుకు వెళ్ళి తపస్సు చేసినా, ఆమె దర్శనం లభించలేదు. ఇంతలో “ఓ శ్రీనివాసా! నీకు ఇక్కడ దర్శనం లభించదు. స్వర్ణముఖీతీరంలో ఒక సరోవరాన్ని ఏర్పాటుచేసి, అక్కడ తపస్సు చేస్తే లక్ష్మీదేవి దర్శనమిస్తుంది” అంటూ ఆకాశవాణి చెబుతుంది. వెంటనే శ్రీనివాసుడు శుకముని ఆశ్రమానికి చేరుకొని, అక్కడ ఒక చెరువు త్రవ్వి, అందులో స్వర్గలోకం నుంచి తెచ్చిన పద్మపుష్పాలను నాటుతాడు. ఆ పుష్పాలు ఎల్లప్పుడూ వికసించి ఉండాలని, అందుకోసం సూర్యదేవుడునికూడా ప్రతిష్టించి పన్నెండేళ్ళ పాటు తపస్సు చేయగా, శ్రీమహాలక్ష్మి పద్మసరోవరంలో బంగారుపద్మంలో పదహారేండ్ల యువతిగా అవతరించింది. పద్మంలో అవతరించినందువల్ల శ్రీమహాలక్ష్మీని పద్మావతిగా పిలుస్తూ దేవతలందరూ ఎన్నోవిధాలుగా స్తుతించి ప్రార్థించారు. మరొక కథ ప్రకారం, ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్న తరవాత, నూతన దంపతులు పర్వతారోహణం చేయరాదని ఆగస్త్యమహాముని చెప్పగా, కోంతకాలంపాటు ఆ కొత్త దంపతులు అగస్త్యమహాముని ఆశ్రమంలోని గడిపారు. అదే శ్రీనివాసమంగాపురం అని చెప్పబడుతోంది. ఆ తదనంతరం కొంతకాలానికి పద్మావతీదేవి తాను తన భర్తతో కలసి వేంకటాచలానికి వెళ్తున్నట్లుగా తన తండ్రికి కబురు చేయగా, ఆకాశరాజు తన కుమార్తెకు వివిధ వస్తువాహనాలను, వస్త్రాభరణాలను, దాసదాసీజనాలను, సారెను ఇచ్చి అల్లుడి వెంట పంపాడు. అలా ఆ నూతనదంపతులు కొండనెక్కుతుండగా, కోంత దూరం ప్రయాణించిన అనంతరం శ్రీనివాసుడు, పద్మావతిని “కరివేపాకు తెచ్చావా?” అని అడిగాడు. ఆమె తేలేదని చెప్పగా, శ్రీనివాసుడు తిరుమలలో కరివేపాకు దొరకదనీ, వెనుకకు వెళ్ళి కరివేపాకును తీసుకుని రమ్మని చెబుతాడు. వెంటనే కరివేపాకు కోసం పద్మావతీదేవి తిరుచానూరు వెళ్ళింది. అక్కడ కరివేపాకు చెట్లు చిన్నవిగా ఉన్నాయి. ఫలితంగా పద్మావతీదేవి కరివేపాకు పంటను పండించడానికి తిరుచానురులోనే కొలువై ఉందట.
తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించబడుతుంటాయి.

సంస్కృతి – సాంప్రదాయం – భక్తి


అక్షింతల పరమార్థం ఏమిటి?

వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టె వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతీ శుభకార్యం లోనూ పెద్దలు, పిన్నలను అక్షింతలు వేసి “దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు” అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి. పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.
‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.
క్షతం కానివి అక్షతలు. అంటే రోకటిపోటుకు విరగని, శ్రేష్టమైన బియ్యం అన్నమాట. అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్రకారాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతెగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్వికాలనే త్రిగుణాలకూ కారకము.
పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలో విద్యుత్తులో కొంతభాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి, పుచ్చుకునే వాళ్ళ కోంత విద్యుత్ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనే మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో ఆంతర్యం, పరమార్థం ఇదే!
మరో సిద్ధాంతం ప్రకారంగా చూస్తేనే – మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవైనాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్ ప్రసారకేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు.
అది సరి కాని! అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపుకుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మసంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షితలు వేసే వారికి ఎలాంటి రోగసమస్యలున్నా, పుచ్చుకునేవాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపుకుంకుమలు నివారిస్తాయిట. అంతేకాకుండా పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో
“అన్నాద్భవంతి భూతాని” అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈఅన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలో చేర్చడమే. అక్షింతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తలయందు పోయబడే
ప్రాలు = బియ్యం అని అర్థం
పూర్వం వధువు దాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. “ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంటధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉంది, మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదగలవాళ్ళమై తులతూగుతూ ఉండాలి” అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకునే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాని వేసి, ఆ మీదట పాలను కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలములో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.
“ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!” అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.
అక్షింతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంట గూడార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడమే అక్షింతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం.

ఆది వైద్యులు

మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు దాపురిస్తే, అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.
ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.
ధన్వంతరీ
‘ వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు పోగడుతుంటారు.
శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.
రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.
ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.
ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.
ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.
దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.
ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.
శ్రీధన్వంతరి మూలమంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే
శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
సుశ్రుతుడు
శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ వివరించబడ్డాయి.
అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది.
చరకుడు
సుశ్రుతుడు శస్త్రచికిత్స  నిపుణుడైతే చరకుడు  ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.
ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.
వాగ్భటుడు
పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.
ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.
ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.
కశ్యపుడు
కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం ‘కశ్యప సంహిత’ ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.
  1. కాయ చికిత్స
  2. శల్య చికిత్స
  3. శాలక్య తంత్ర
  4. అగాధ తంత్రం
  5. భూత విద్య 
  6. కౌమార భృత్య
  7. రసాయన తంత్రం
  8. వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.
అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.
  1. చూర్ణం
  2. శీతకషాయం
  3. స్వరస
  4. అభిసవ
  5. ఫంట
  6. కలక
  7. క్వత
కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.
జీవకుడు
జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.
అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.
నాగార్జునుడు
నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో కూడ నాగార్జునుడు సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం. చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర
“ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!”

చారిత్రిక సాక్ష్యం -‘సాంచి ’

“స్తూపం అనగానే మనకు ప్రపథమంగా గుర్తుకొచ్చేది సాంచీస్తూపమే. బౌద్ధమతస్తులనే కాదు, మిగతా మతస్తులను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ స్తూపం అద్భుతమైన శిల్పకళతో  విరాజిల్లుతోంది. జాతక కథలు శిల్పాలు రూపంలో మలచబడి ఉండటం సాంచీ ప్రత్యేకత!”
స్తూపం అనగానే మన మదిలో కదిలేవి బౌద్ధస్తూపాలే. సాంచీ, అమరావతి, నాగార్జునకొండ, సారనాథ్, నలంద తదితర ప్రదేశాలలోని బౌద్ధ స్థూపాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంటాయి. అయితే ఈ స్తూపనిర్మాణం బుద్దుని కంటే  ముందు నుంచే మనదేశంలో జరిగిందనడానికి చాలా ఆధారాలున్నాయని చరిత్రకారులు అంటుంటారు. తన దేహత్యాగం అనంతరం, తన అస్తికలపై ఓ స్తూపాన్ని నిర్మించమని గౌతమబుద్దుడే చెప్పాడనీ, ఫలితంగా బుద్దుని నిర్యాణానంతరం మగధ రాజధాని రాజగృహం, వైశాలి, కపిలవాస్తూ వంటి నగరాలలో బుద్దుని అస్తికలపై స్తూపాలు నిర్మించబడ్డాయని చెబుతారు.
ప్రస్తుతం మనదేశంలో  స్థూపాలలో సంపూర్ణ రూపంలో గోచరించేది సాంచీస్తూపం ఒక్కటే. మన రాష్ట్రంలోని నాగార్జునకొండ,  అమరావతి స్థూపాలు కూడా ప్రసిద్ధి చెందినవే. ముఖ్యంగా అమరావతిలో లభ్యమైన శిల్పాలను చెన్నై ఎగ్మూరు పురావస్తు ప్రదర్సనశాలలో చూడవచ్చు. నాగార్జునసాగర్ నిర్మాణం అనంతరం ఏకంగా నాగార్జున కొండలోని పురాతన ప్రసిద్ధి చెందిన ప్రాంతం జలసమాధి అయింది. ఫలితంగా బౌద్ధస్తూపమంటే, సాంచీ బౌద్ధస్తూపమే ప్రముఖంగా గోచరిస్తుంటుంది. బౌద్ధ నిర్మాణశైలి, శిల్పకలాశైలిని దర్శించుకోవాలంటే సాంచీకీ  వెళ్ళాల్సిందే.
సాంచీలోని మహాస్తుపం మౌర్యచక్రవర్తియైన అశోక చక్రవర్తి వలన నిర్మించబడిందని తెలుస్తోంది. సాంచీతో  అశోకునికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన యవ్వనంలో రాజప్రతినిధిగా ఉన్నప్పుడు, సాంచీకి పది కిలోమీటర్ల దూరంలోనున్న విదిశానగరంలోనే  ఉన్నాడు. విదిశానగరం  నేటి ముంబైనగరం వలె ఆ రోజుల్లో ప్రసిద్ధ వ్యాపారకూడలి. ఆ నగరంలో ఓ వ్యాపార ప్రముఖుని కుమార్తెను అశోకుడు వివాహం చేసుకున్నాడు. వారి సంతానం మహేంద్రుడు, సంఘమిత్ర ఉజ్జియనీ నగరంలో జన్మించారు. మహేంద్రుడు శ్రీలంకకు వెళ్ళేముందు కొంతకాలంపాటు  విదిశా నగరంలో వసించాడు.
అశోకుడు కట్టించిన స్తూపం ఇటుకరాళ్ళతో నిర్మించబడి, పైన బంకమన్ను పూయబడింది. ప్రస్తుతము మనం చూస్తున్న స్తూపం 37 అడుగుల చుట్టు కొలతతో, పైనున్న గొడుగుతో  కాకుండా స్తూపం ఎత్తు 16 1/2 అడుగుల ఎత్తుతో కనబడుతుంటుంది. అయితే అశోకుడు ఇప్పుడున్న పరిమాణంలో సగం పరిమనంతోనే స్తూపాన్ని నిర్మించాడు. ఈ స్తూపం ప్రక్కన ఎకశిలాస్తంభాన్ని చూడగలం. మౌర్యుల తరువాత రాజ్యాధికారాన్నిచేప్పట్టిన సంగరాజవంశీయులు, స్తూపాన్ని గట్టిరాళ్ళతో రెండింతలు పెద్దదిగా నిర్మింపజేసారు. ఈ స్తూప నిర్మాణంలో అధికంగా పాలుపంచుకున్నది అక్కడున్నబౌద్ధభిక్షువులు, బౌద్ధమత అనుయాయులే. అనంతరకాలంలో స్తూపం చుట్టూ వలయాకారమార్గం, స్తూపాన్ని సగం ఎత్తున ప్రదక్షణామార్గం, శిఖరభాగంపై హార్మిక నిర్మించబడ్డాయి. అనంతరం శాతవాహనులకాలంలో 1,3వ స్థూపాలకు శిల్పకళా శోభితమైన ద్వారతోరణాలు నిర్మించబడ్డాయి. ఇక, గుప్తుల కాలాన్ని చాలామంది చరిత్రకారులు స్వర్గయుగం అని చెబుతుంటారు. ఆకాలంలో సాంచీలో కొత్తకొత్త నిర్మాణాలు, అప్పటికి ప్రాచుర్యంలోకి వచ్చిన బుద్దుని విగ్రహరూపాలు  నెలకొల్పబడ్డాయి. చాలా కాలంపాటు బుద్ధునికి విగ్రహరూపం లేదు. ధర్మచక్రం, తామరపువ్వు, ఏనుగు, భోదివృక్షం, సింహాసనం, అగ్నిస్తంభం, పాదముద్రికలు వంటివే అప్పటివరకు బుద్ధునికి గుర్తుగా భావించబడుతూ వచ్చాయి. ఇలా పన్నెండవ శతాబ్దం వరకు సాంచీలో బౌద్ధమతం, కళలు ఎంతో గొప్పగా విలసిల్లాయి. 13వ శతాబ్దం నుంచి సాంచీ గురించిన  చారిత్రిక ఆధారాలు పెద్దగా లభ్యం కావడంలేదనే చెప్పాల్సి ఉంటుంది. అనంతరం ఆంగ్లేయులు మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత 1818వ సంవత్సరంలో 1,2,3 స్థూపాలను జనరల్ డయ్యర్ కనిపెట్టాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ 2,3 స్తూపాలకు చెందిన పగిలిపోయిన ఫలకాలను కనుగొన్నాడు. అయితే మహాస్తూపం నుంచి ఎటువంటి అస్తిఫలకాలు  లభించలేదు. 1912-1919 సంవత్సరం వరకు పురావస్తుశాఖ నిర్వాహకునిగా  ఉన్న సర్. జాన్ మార్షల్ అహర్నిశలు కృషి చేసి, సాంచీ, ఆ చుట్టుప్రక్కల అడవులలో నున్న పురాతన చిహ్నాలను వెదకి వెదకి సేకరించి  భావి తరాల కోసం భద్రపరిచారు.
బౌద్ధస్తుపం అంటే, దాని పరిమాణం పెద్దదా? లేక చిన్నదా అనే విషయాలు తప్ప వేరే ప్రేత్యకత ఏమి ఉండదు. స్తూపం అంటే ఓ సమాధియే తప్ప మరేమీ కాదు. కానీ, బౌద్ధభిక్షువులకు, అనుయాయులకు అలా కాదు. అవి అత్యంత పవిత్రమైన స్థలాలు. అక్కడ, వారి ఇష్టదైవానికి ఏమైనా చేయాలని ఆశ పడుతుంటారు. అక్కడ నిరంతరంగా ఉండేలా శిలలను చెక్కిస్తుంటారు. కాని, స్తూపంలో అందుకు చోటు ఉండదుగా! అందుకే స్తూపం చుట్టూ తోరణ ద్వారాలను ఏర్పాటుచేశారు. ఈ శిల్పాలను నాల్గు విధాలుగా విభజించవచ్చు. జాతక కథల దృశ్యాలు, బుద్ధుని జీవిత చిత్రణ దృశ్యాలు, బౌద్ధమతంలో ఏర్పడిన పరిణామాలు అంటూ పలురకాలైన దృశ్యశిల్పాలను, రాతి పుష్పాలను, చెట్లను, అలంకారాలను చూడవచ్చు.
ఒక్కొక్క తోరణ ద్వారానికి అటు ఇటు చదరంగా ఉండే రెండు స్తంభాలు. వాటి పైన నాల్గు సింహాలు, లేక నాలుగు ఏనుగులు లేక బానపొట్టతో కూడిన యక్షులు గోచరిస్తుంటారు. వాటిపై అడ్డంగా మూడు రాతి పట్టీలు. అవి అటు ఇటు గుండ్రంగా చుట్టబడినట్లు మలచబడ్డాయి. ఈ తోరణాలు సుమారు ఎనిమిదిన్నర మీటర్ల ఎత్తుంటాయి. కిందఉన్న రాతిపట్టిలో అందమైన యువతులు నాట్యం చేస్తున్నట్లుగా శిల్పాలను మలిచారు. పైన్నున్న రాతి పట్టిపై బుద్దుడు, త్రిరత్నాలు మొదలైన ప్రతిమలున్నాయి. ఉత్తరంవైపున్నున్న తోరణద్వారానికి కాస్తంత కుడా ఖాళీ లేకుండా అలంకార శిల్పాలున్నాయి. సాంచీకి సోబగును చేకూర్చేవి ఈ తోరణద్వారాలే. ఈ తోరణ ద్వారాలలో దేవతలు, మనుషులు, ఏనుగులు, గుర్రాలు, పశువులు, కోతులు అంటూ సమస్త ప్రకృతినే చూస్తున్నాం.
నాలుగు తోరణ ద్వారాల నుంచి  లోపలికి ప్రవేశించి మెట్ల పైకెక్కినప్పుడు, మనకు ఎదురుగా కనిపించేది మహా స్తూపం యొక్క ఉత్తరద్వారం. నాలుగు ద్వారాలలో ఈ ద్వారమే చాలా అందంగా తీర్చిదిద్ధబడింది. అశోకుని కాలంలో అక్కడక్కడా బౌద్ధ స్తూపాలు నిర్మించబడి, పండితులుతో పాటు పామరులు కూడా బౌద్ధమతం పట్ల ఆకర్షితులయ్యేల చేయబడింది. ఆ స్తూపాలలో అన్ని మతాలకు చెందిన చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా స్తూపాలను పూజించడం ఈ జనానికి అలవాటైంది. ఆ స్థూపాలలోవున్న యక్ష, యక్షిణి,  వనదేవాతలు, నాగాదేవాతలు, నదీ దేవతలు మరియు చెట్టూచేమా, పుష్పాలు, మృగాలను చూసిన ప్రజలు బౌద్ధమతంతో మమేకమైపోయారు.
ఒకటవస్తూపం : ఇది  మౌర్యచాక్రవర్తి అశోకుని కాలంలో నిర్మించబడింది. అండాకారంలో నిర్మించబడిన ఈ స్తూపం, మౌర్యులకాలంలో ఇప్పుడున్న దానిలో సగం వంతులో కట్టబడింది. అనంతరం ఈ స్తూపం సంగ వంశ రాజులకాలంలో సున్నపురాయితో భారీగా నిర్మించబడినది. అండాకారంలో నిర్మించబడిన ఈ స్తూపం పైభాగం చదరంగా నిర్మించబడి, దానిపై ‘ హార్మిక ’ అనే పెట్టె వంటి భాగం, ఆ పెట్టె మధ్యభాగంలో ఓ స్తంభం, స్తంభంపై గొడుగువంటి భాగం రూపుదిద్దబడింది. ఈ పెట్టెభాగంలో బుద్ధుని ఆస్తికలను ఉంచారట. అయితే ప్రస్తుతం అటువంటి అనవాళ్ళేమీ లేవు. ఈ స్తూపానికి రెండు ప్రదక్షిణా మార్గాలున్నాయి. దీనికొక అందమైన తోరణ ద్వారం ఉంది.
రెండవస్తూపం : ఇది ఒకటవ స్తూపానికి 320 మీటర్ల దూరంలో ఉంది. దీనిపైన  ‘హార్మిక’ అనే పెట్టె, గొడుగుల వంటివి లేవు. దీనికి చుట్టూ ప్రదక్షిణా మార్గాలు ఉన్నప్పటికీ, తోరణద్వారం లేదు.
మూడవ స్తూపం : ఇది ప్రధాన స్తూపానికి సుమారు 60 మీటర్ల దూరంలో ఉంది. ఇది పరిమాణంలో  చిన్నదిగా ఉన్నపటికీ మొదటి స్తూపాన్ని గుర్తుకు తెస్తుంటుంది. ఇంచుమించు మొదటి స్తూపంలానే నిర్మించబడింది.
తోరణాలు : సాంచీ స్తూపాలనగానే మనకు తోరణాలు కూడా గుర్తుకొస్తుంటాయి. తోరణాలు లేని స్తూపాలను ఊహించలేము. వీటిలో చాలామటుకు శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయని ప్రతీతి. వీటిపై జాతక కథలు మలచబడ్డాయి. ఓ రాజు ఊరేగింపుగా వస్తుండటం, రైతు పొలంలో పని చేస్తుంటే, అతని భార్య తలపై పాత్రతో ఆహారాన్ని తీసుకోని వస్తుండటం, ఆరు తొండాల ఏనుగు అంటూ ఒక్కొక్క స్తూపం, అనేక కథా దృశ్యాలను మన ముందు ఉంచుతుంటుంది. ఒక విధంగా ఈ తోరణాలను రాతిపుస్తకాలు అని అనవచ్చు. మచ్చుకు ఓ కథ :
“పూర్వం బోధిసత్త్వుడు ఎనిమిదివేల కోతులకు రాజుగా కోతిజన్మను ధరించాడు. బోధిసత్త్వుని పరిపాలనలో కోతుల్లన్ని గంగానది ఒడ్డున్నున్న మామిడితోపులలో జీవిస్తూ, తియ్యతియ్యగా ఉండే మామిడి పండ్లను భుజిస్తూ ఆనందమయ జీవితాన్ని గడుపుతుండేవి. ఈ తీపి మామిడిపండ్లను  గురించి కాశీరాజు బ్రహ్మదత్తునకు తెలిసింది. ఆ తీపి మామిడి పండ్లు తినాలన్న ఆకాంక్షతో తన సైనికులతో ఆ మామిడి తోపును ముట్టడించాడు. రాజు, అతని సైనికులు కంటికి కనబడిన కోతులను బాణాలతో వధించడం ప్రారంభించారు. కోతులను కాపాడాలనుకున్న కోతులరాజు ఓ వెదురుబొంగును గంగానదికి అడ్డంగా వేసి కోతులను రక్షించాలనుకున్నాడు. కానీ, ఆ వెదురు బొంగు పొడువు గంగకు అడ్డంగా వేసినపుడు కొంత తగ్గింది. దాంతో బోధిసత్త్వుడు వెదురుబొంగును గంగకు అవతలి వైపునున్న చెట్టుకు కట్టి, ఇటుప్రక్క తను ఒక వెదురు బొంగులా అడ్డంగా పడుకున్నాడు. అలా తన వారిని  సురక్షితంగా దాటావేసాడు. ఇదే అదను అనుకున్న శత్రురాజు అతనిపై దండెత్తగా, తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్న బోధిసత్త్వుడు శత్రువుకే ధర్మబోధ చేసాడు.”
సాంచీ అంటే స్తుపాలే కాదు, నాటి రోజుల్లో ఈ ప్రాంతము  గుడులకు, బౌద్ధారామాలకు, ప్రసిద్ధి చెందింది. అయితే అవన్ని ధ్వంసమై, ప్రస్తుతం పురావస్తు శాఖవారి  ఆధ్వర్యంలో పరామర్శించబడుతున్నది. ఈ స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాయసేజ్ జిల్లాలో ఉంది. ఇది భోపాల్ నగరానికి సుమారు 46 కి.మీ. దూరంలో ఉంది. రైలు మార్గంలో విదిశ, లేక ఇండోర్ నగరాలకు చేరుకొని అక్కడ్నుంచి బస్సులో సాంచీకి చేరుకోవచ్చు.

వృక్షో రక్షతి రక్షితః

చెట్లను మనం కాపాడితే అవి మనలను కాపాడతాయని మన పెద్దలవాక్కు. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అని అన్నారు. మన సంస్కృతీ ప్రకృతితో మమేకమైనది. మన పూజావిధానాలను పరిశీలించితే, లేక పురాణాలను పఠించితే ప్రకృతికీ మనకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని తేటతెల్లం చేసే విదానంగానే ఉంటుంది.
ఉదాహరణకు మన పురాణాలనే తీసుకుందాం. అడవులు కూడ నివాసయోగ్యాలుగానే చిత్రీకరించబడ్డాయి. ఋషులు తమ ఆశ్రమాలను అటవీప్రాంతాలలోనే నిర్మించుకున్నారు. శ్రీరాముడు. ధర్మరాజు వంటి వారు అష్టైశ్వర్యాలను త్వజించి వెళ్ళింది అడవులకే. ఈ నేపధ్యంలో మన పురాణాల్లో నైమిశారణ్యం, దండకారణ్యం, తాతకవనం, ఖాండవవనం, హిండింబవనం వంటి అరణ్యప్రాంతాలను చూడగలం. ఒక్కొక్క వనానికి ఒక్కొక్క ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయా వనాలలో నున్న చెట్లను గురించి, ఆ చెట్ల యొక్క ఔషధ గుణాలను గురించి ఆయా పురాణాలలో విపులీకరించబడింది.
నైమిశారణ్యం
మన పూర్వీకులకు ప్రకృతి పట్ల, వృక్ష, జంటజాలాల పట్ల ఎనలేని అభిమానం. ఆరోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీప్రాంతం నైమిశారణ్యం. ఇక్కడే సప్తఋషులు వేదాలను వల్లించారు. ఈ వనంలోనే వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథానికి రూపకల్పన చేసాడు. వినాయకుడు రాస్తుండగా, వ్యాసమహర్షి మహా భారతాన్ని చెప్పింది నైమిశారణ్యంలోనే, భాగవతం కూడా చెప్పబడింది ఇక్కడే. ఇక్కడే సూట మహర్షి భాగవత గాథను చెప్పాడు. అందుకే నైమిశారణ్యంలోని ప్రతి చెట్టు యొక్క ఆకులు భాగవత శ్లోకాలను వల్లించుతాయని ప్రతీతి.
“మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రకృతికి మనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి వివరంగా చెబుతుంటాయి. ‘ఓషధిభ్యాః అన్నమ్, అన్నాత్ పురుషాః’ అని త్తెత్తీరీయోపనిషత్ చెబుతోంది. అంటే, అన్నం నుంచి పురుషుడు అంటే జీవుడు పుట్టి, తనకు కావలసిన ఆహారాన్ని మొక్కలు, చెట్ల నుంచి గ్రహిస్తున్నాడని అర్థం. ఈ నేపథ్యంలో మన పురాణాలను పరికించినపుడు, మనవాళ్ళు ప్రకృతినే పరమాత్మగఅ కొలుచుకుంటున్న విషయం తేటతెల్లమవుతుంది.”
అసలు నైమిసారణ్యాన్ని విష్ణుమూర్తి ఒక నిముష మాత్రములో తన సంకల్పమాత్రం చేత ఈ అరణ్యాన్ని సృష్టించాడని కథనం. ఈ అరణ్యంలోనుంచి ప్రవహిస్తున్న గోమతీ నది అనేక మూలికలతో కూడుకుని ఉంటుందట. ఈ నదిని ఆదిగంగ అని పిలుస్తుంటారు. శ్రీరామచంద్రుడు ఇక్కడ తన పితృదేవతలకు పూజలు చేసాడట. వృతాసురుని సంహరించేందుకు ఈ నైమిశారణ్యంలోనే దధీచి తమ ఎముకులను వజ్రాయుధం తయారీకోసం బహుకరించాడు. ఇలా నైమిశారణ్యం మన పురాణాలలో గోచరిస్తుంటుంది.
దండకారణ్యం
శ్రీరాముడు వనవాసాన్ని చేయడానికి సంకల్పించినప్పుడు, ఆయన వెళ్ళాలనుకున్నది దండకారణ్యానికే. ఈ అడవిలోనే సీతారామలక్ష్మణులు ఎక్కువ వనవాస సమయాన్ని గడిపారు. సీతారామదంపతులకు అడవిలో జీవనాన్ని ఎలా గడపాలన్న విషయాలను అత్రిమహర్షి – అనసూయాదేవిలు తెలిపారట. ఇక్కడ ఐదు వృక్షాల మధ్య లక్ష్మణునిచే నిర్మించబడిన  ‘పంచవటి’ సీతారాములకు స్వర్గం కంటే విలువైనది.
అయితే ఈ దండకారణ్యం ఓ పాపాత్ముని వలన ఏర్పడినదని ఉత్తర రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం ఇక్ష్వాకుని పుత్రులలో దండుడు అనే కడపటి కొడుకు ఉండేవాడు. దండుడు చిన్నప్పట్నుంచి కడు దుర్మార్గుడు. తన బాల్యంలో అనేకమంది బాల్యమిత్రులను చంపుతుండేవాడు. అతని ఆగడాలను భరించలేకపోయిన ఇక్ష్వాకుడు దండుని వింధ్యపర్వతాల అవతలకు తరిమేశాడు. అక్కడికి వెళ్ళిన దండుడు మధుమంతపురం అనే నగరాన్నినిర్మించి పరిపాలన చేయసాగాడు. అనంతర కాలంలో శుక్రుని వద్ద శిష్యకరం చేసిన దండుడు, ఒకరోజు శుక్రుని కూతురు అరజను బలాత్కరించాడు. అరజతను గురువు కూతుర్ని కనుక, అతనికి చెల్లెలి వరుస అవుతానని, ఇటువంటి దుర్మార్గం తగదని బ్రతిమాలుకున్నప్పటికీ, దండుని అకృత్యం ఆగలేదు. ఈ వార్తను విన్న శుక్రుడు ఆగ్రహంతో దండుడు రాజ్యంపై మట్టి వాన కురిసి, అతని రాజ్యమంతా భూస్తాపితమైపోవాలని శపించాడు. వెంటనే మధురమంతపుర రాజ్యం మట్టి వర్షంలో మునిగిపోయి, కొంతకాలం తర్వాత ఆ మట్టిపై దట్టమైన అడవి ఏర్పడి దండుని పేర దండకారణ్యం అని పిలువబడింది. కాబట్టి ఇక్కడ మనకు ఓ విషయం స్పష్టమవుతోంది. ఋషులు ఓ దుర్మార్గుని శపిస్తున్న సమయములో కూడ ఆ శాపం ప్రకృతికి పరిరక్షణకు అనుకూలంగా ఉండేట్లుగా చూసుకున్నారన్నవిషయాన్ని మానమ గ్రహించాలి.
తాటకవనం
రామాయణంలో దండకారణ్యంతో పాటు మరో ప్రసిద్ధమైన వనం ఉండేది. అదే తాటకవనం. పూర్వం తాటక అనే రాక్షసి అడవిలో తనకు కనబడిన మనుషులను తింటూ, ఆ అడవినంతా ధ్వంసం చేస్తుండేది. చివరకు ఆ రాక్షసి విశ్వామిత్రుడు దశరథుని అనుమతితో బాల రామలక్ష్మణలను ఆశ్రమానికి తీసుకెళ్తుండగా, తాటక ఎదురైంది. అలా తనకు ఎదురుపడిన తాటకను బాలరాముడు ఒక్క బాణంతో సంహరించాడు. అప్పుడా రాక్షసి శాపవిమోచనం పొంది, గాంధర్వకన్యగా మారిపోతుంది. తానూ అగస్త్యుని వలన శాపానికి గురైయ్యానని, తనకు శ్రీరాముని వలన శాపవిమోచనం కలిగినందుకు జన్మ సాఫల్యమైందనిచెబుతూ, తన లోకానికి వెళ్ళిపోతుంది.
ఇక మహాభారతం, భాగవతంలో కూడ అనేక అరణ్యాల ప్రసక్తులు ఉన్నాయి.

గురుదేవోభవ

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మవిధయే వాసిష్ఠాయ నమోనమః
వేదమూర్తియైన వశిష్ఠుని వంశంలో జన్మించిన మహామునే విష్ణువు. విష్ణువే వేదవ్యాస మహాముని. అట్టి మహానీయునికి నమస్కారం.
పరాశరులు వేదవతిని వివాహమాడినపుడు శ్రీమహా విష్ణువు నీ కుమారునిగా నేను జన్మించగలనని తెల్పాడు. ఆ కారణంతో ఆయనే వ్యాసమహర్షియై జన్మించాడు. నాది సాధారణమైన మానవజన్మ కాదని నిర్థారించుటకుగాను పుట్టిన వెంటనే ఏడు సంవత్సరాల బాలునివలె రూపొందాడు. నదీ మధ్యమున నల్లనివాడుగా జన్మించటం వలన ఈయనకు కృష్ణాద్వైపాయనుడు పేరుకూడా వుంది.
వేదాలు ఆపౌరుషేయాలు, భగవద్దతములు, వాటిని పరిష్కరించి రుగ్యజుస్సామాధర్వణ వేదాలుగా లోకానికి అందించిన పరబ్రహ్మస్వరూపుడైన ప్రథమగురువు వేద వ్యాసమహర్షి.
ఆయన ఉపనిషత్తుల తత్వాన్ని, భారత, భాగవతాలను, భారతంలో ప్రధానంగా భగవద్గీతను, అష్టాదశపురాణాలను ఇంకా ఎన్నో తాత్విక శాస్త్ర గ్రంథాలను రచించి ప్రపంచానికందించి భారతదేశ తాత్వికత ప్రపంచదేశాలలో మకుటాయమానమైనదని తలంపజేసారు.
లోక కల్యాణానికి మహాత్ములు జన్మిస్తారు. సకలజనుల శ్రేయస్సుకై తమ మనుగడను సాగించి చరితార్థులౌతారు. శ్రీ వ్యాస భగవానుడు దైవకార్యాన్ని నిర్వహించే దానికిగాను జన్మించిన దినమే ఆషాఢపూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమ అని, గురుపూర్ణిమ అని కూడా అంటారు ఆ రోజున దేశంలోని గురువులందరు పూజింపబడతారు. ఉత్తమగురువులు త్యాగధనులు కావున కాషాయ వస్త్రాలను ధరించి నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తారు.
“గు" శబ్దం అంధకారానికి పేరు. “రు” శబ్దము దాని నివాసనం జేయు ప్రకాశం. అనగా అజ్ఞానమనెడి చీకటిని ప్రారద్రోలి స్వయం ప్రకాశకమగు పరబ్రహ్మమును తెలియ జేయునది అని అర్థం.
జననీజనకులు శరీరమిచ్చి పోషించి, కాపిడినవారు. వారని జ్ఞప్తియందు ఉంచుకొని కృతజ్ఞతాభావంతో మేలగుతుంటాము. అదేవిధంగా సోదరులు, స్నేహితులు, బంధువులు మానసిక, సాంఘిక బందుత్వంగల వారు గావున వారితో మర్యాద, మన్ననలతో నడచుకుంటూ ఉంటాము. వీరందరితోడి సంబంధము వ్యక్తీ జీవించి ఉన్నంతవరకే, కాని గురువుతోడి సంబంధం ఇలాంటిది కాదు. అది ఆధ్యాత్మికమైనది. అతడు తన శిష్యుని తరింపజేయునట్టి మహత్వమును ప్రసాదించినాడు. కాబట్టి, అందరి కంటే గురువు ఉన్నతమైనవాడుగా గుర్తింపబడ్డాడు.
ప్రతివారికి మొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత విద్యనభ్యసింపజేసినా గురువు. ఈ గురువులో దైవత్వాన్ని చూడాలన్న భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పది. పెద్దలను, గురువులను, మహాత్ములను దర్శించినపుడు మనం రెండు చేతులులను జోడించి నమస్కరిస్తాం. ఆ నమస్కారానికి అత్యున్నమైన అర్థముంది. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయమని దాని భావనం. మన సంస్కారానికి ప్రతిగా గురువు అభయముద్రను ప్రసాదిస్తాడు. అదే గురవు అనుగ్రహం. అదివుంటే జీవితం చరితార్థమైనట్లే. అంతకంటే జీవితంలో కోరదగిందేమిలేదు.
సద్గురువు శాస్త్ర విజ్ఞానంలో దిట్టగా, నిష్కళంక చరిత్ర గలవాడుగా, కామక్రోధాది అరిషడ్వర్గాలకు దూరుడైన వాడుగా, నిశ్చలస్థితిని పొందినవాడుగా, సత్య దయా శౌచములను కలిగినవాడుగా, తనను ఆశ్రయించినవారికి ఆప్తుడుగా వుండాలి. అతడు నిరంతరం శిష్యులకు దైవ సాక్షాత్కార మార్గమును ఉపదేశిస్తూ, దివ్యజీవనమునే గడుపుతుండాలి. ఇదే సద్గురువు లక్షణం.
గురువు ఆశ్చర్యాన్ని కలిగించేతంతటి మేధాశక్తిని కలిగియుండి, శిష్యుడు కాదు నేర్పరియైనపుడు గురుశిష్యసంబంధం విజ్ఞానవంతంగాను, వర్ణనాతీతంగాను ఉంటుంది. గురువు జ్ఞాని కాకపొతే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించినవిధమే ఔతుంది. కళ్ళకు గంతలు కట్టుకోన్నవాడు ఇంకొకడి కళ్ళ గంతలను ఎలా విప్పి దారి చూపగలడు? కావున గురువు ఆత్మజ్ఞానియై ఉండాలని భావం. వాస్తవానికి గురువు ఏదో ఒక విషయాన్ని బోధించు వాడై ఉండరాదు. అతడు కేవలం విద్యాబోధన చేయు వాడుగాడు. అతని సంబంధం ఆత్మా పర్మాత్మలకు చెందినట్టిది. విద్యనూ నేర్చుకొన్నా, నేర్చు కొనకపోయినా ఆత్మజ్ఞానాన్ని మాత్రం పొందాలి. ఆ లక్ష్యాన్నినెరవేర్చు వాడెవరో అతడే నిజమయిన గురువు. గురువు ద్వారా ఆత్మజ్ఞానమును పొందినవాడే నిజమైన శిష్యుడు.
గురవు లేకపోయినా జ్ఞానం కలగటం అసంభవం. భారతదేశంలో మహాత్ములందరికి గురువులున్నారు. శ్రీరామునకు, శ్రీకృష్ణునికి గురువులున్నారు. అదేవిధంగా శ్రీశంకరులు, శ్రీరామకృష్ణులవారికీ గురువులున్నారు. వారు సహజంగానే సద్గురువులు. కాని, వారు గురువులను ఆశ్రయించే జ్ఞానాని పొందారు. పూర్ణత్వమును పొందినట్టివారికి గురువు అవసరం లేదు, కాని అట్టివారెవారని చెప్పగలం?
నీవు చదివిన విద్య ఎట్టిదో తెలుపమని తండ్రియగు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని అంటాడు. చదువులలో మర్మమంటే ఏమిటి? అదే ఆత్మజ్ఞానం. “అహం బ్రహ్మస్మి”. తానూ శరీరం కాదు “ఆత్మ” అనే జ్ఞానాన్ని పొందడం. నీవు ఇప్పుడు అహంకారాన్ని వదిలి భగవంతుని శరణాగతి వేడితే నీలో ఉన్న ఆత్మయే సద్గురు రూపంలో ప్రత్యక్షమౌతాడు.
గురుపూర్ణిమ నుండే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమౌతుంది. సద్గురువులు వ్రత దీక్షపూని తమ శిష్యులకు మార్గదర్శకులౌతారు. గురుశిష్య సాంప్రదాయం చాలగోప్పది. ఒక గురువువద్ద తయారైన సత్య నిష్ఠ గల శిష్యుడు, మరికొంతమంది శిష్యులకు గురువై సద్గురు సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు.
నమోస్తు గురవే తస్మై! ఇష్ట వేద స్వరూపిణే
యస్యవాక్యామృతం హంతి విషసంసారి పంజ్కిలం
ఎవరి అమృతవాక్కువల్ల సంసారమనే విషం నుండి తరుణోపాయంలభిస్తుందో, ఆగురువుకు నమస్కారం. సద్గురువు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. ఆయన ప్రక్కన భగవంతుడే నిల్చున్నా ప్రథమ నమస్కారం సద్గురువుకేనంటాడు కబీరుదాసు.