అక్షింతల పరమార్థం ఏమిటి?
వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టె వేళ, మాంగల్యధారణ వేళ,
వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ
శుభకార్యాల్లోనే కాదు, ప్రతీ శుభకార్యం లోనూ పెద్దలు, పిన్నలను అక్షింతలు
వేసి “దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య
ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు” అంటూ ఆశీర్వదిస్తారు. ఇక
దైవసన్నిధిలో సరే సరి. పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.
‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.
క్షతం కానివి అక్షతలు. అంటే రోకటిపోటుకు విరగని, శ్రేష్టమైన బియ్యం అన్నమాట. అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్రకారాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతెగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్వికాలనే త్రిగుణాలకూ కారకము.
పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలో విద్యుత్తులో కొంతభాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి, పుచ్చుకునే వాళ్ళ కోంత విద్యుత్ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనే మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో ఆంతర్యం, పరమార్థం ఇదే!
మరో సిద్ధాంతం ప్రకారంగా చూస్తేనే – మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవైనాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్ ప్రసారకేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు.
అది సరి కాని! అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపుకుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మసంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షితలు వేసే వారికి ఎలాంటి రోగసమస్యలున్నా, పుచ్చుకునేవాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపుకుంకుమలు నివారిస్తాయిట. అంతేకాకుండా పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో
“అన్నాద్భవంతి భూతాని” అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈఅన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలో చేర్చడమే. అక్షింతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తలయందు పోయబడే
ప్రాలు = బియ్యం అని అర్థం
పూర్వం వధువు దాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. “ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంటధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉంది, మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదగలవాళ్ళమై తులతూగుతూ ఉండాలి” అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకునే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాని వేసి, ఆ మీదట పాలను కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలములో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.
“ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!” అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.
అక్షింతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంట గూడార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడమే అక్షింతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం.

ఆది వైద్యులు
మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని,
వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే
నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు దాపురిస్తే,
అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.
ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.
శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.
రాక్షసులు పెట్టే బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.
ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.
ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.
ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.
దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.
ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.
శ్రీధన్వంతరి మూలమంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే
శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.
ధన్వంతరీ
‘ వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ
స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు
పోగడుతుంటారు.శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.
రాక్షసులు పెట్టే బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.
ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.
ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.
ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.
దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.
ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.
శ్రీధన్వంతరి మూలమంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే
శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
సుశ్రుతుడు
శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది
సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు,
సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన
విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా,
సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు
చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని
నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు.
సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా
అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం
మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి
భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184
అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి
ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ
వివరించబడ్డాయి.
అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ,
ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది
గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్
హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది.
చరకుడు
సుశ్రుతుడు శస్త్రచికిత్స నిపుణుడైతే చరకుడు ఆయుర్వేద
వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు.
ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.
ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము
గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి
చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను
నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా
ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా
అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల
వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు
వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట.
మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా
విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు
ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.
వాగ్భటుడు
పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు
ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత
వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన
వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే
బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు
పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే
అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు
బుద్ధుని స్మరించుకుంటాడు.
ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన
కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో
ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా
పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి,
ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి
జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.
ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150
విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు
తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ
అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా
వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే
రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి
వివరించబడింది.
కశ్యపుడు
కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి
వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం ‘కశ్యప సంహిత’
ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది.
ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.
-
కాయ చికిత్స
-
శల్య చికిత్స
-
శాలక్య తంత్ర
-
అగాధ తంత్రం
-
భూత విద్య
-
కౌమార భృత్య
-
రసాయన తంత్రం
-
వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.
అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.
-
చూర్ణం
-
శీతకషాయం
-
స్వరస
-
అభిసవ
-
ఫంట
-
కలక
-
క్వత
కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.
జీవకుడు
జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ
గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని
కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం
తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని
చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను
అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు
పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి
పనికిరాని మొలకను తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక
యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని
మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి
చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.
అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు
సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా
ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని
అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా గాయమైంది. అప్పుడు జీవకుడు
కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి
తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు.
అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే
బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే
చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో
ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ
ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.
నాగార్జునుడు
నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ
వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో కూడ నాగార్జునుడు
సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా
అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి
పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల
ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం.
చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు
పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా
గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు
ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే
భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని
పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర
“ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో,
వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ
తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే,
అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా
నమ్మి, ఆచరించటమే!”
చారిత్రిక సాక్ష్యం -‘సాంచి ’
“స్తూపం అనగానే మనకు
ప్రపథమంగా గుర్తుకొచ్చేది సాంచీస్తూపమే. బౌద్ధమతస్తులనే కాదు, మిగతా
మతస్తులను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ స్తూపం అద్భుతమైన శిల్పకళతో
విరాజిల్లుతోంది. జాతక కథలు శిల్పాలు రూపంలో మలచబడి ఉండటం సాంచీ
ప్రత్యేకత!”
స్తూపం అనగానే మన మదిలో కదిలేవి బౌద్ధస్తూపాలే. సాంచీ, అమరావతి, నాగార్జునకొండ, సారనాథ్, నలంద తదితర ప్రదేశాలలోని బౌద్ధ స్థూపాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంటాయి. అయితే ఈ స్తూపనిర్మాణం బుద్దుని కంటే ముందు నుంచే మనదేశంలో జరిగిందనడానికి చాలా ఆధారాలున్నాయని చరిత్రకారులు అంటుంటారు. తన దేహత్యాగం అనంతరం, తన అస్తికలపై ఓ స్తూపాన్ని నిర్మించమని గౌతమబుద్దుడే చెప్పాడనీ, ఫలితంగా బుద్దుని నిర్యాణానంతరం మగధ రాజధాని రాజగృహం, వైశాలి, కపిలవాస్తూ వంటి నగరాలలో బుద్దుని అస్తికలపై స్తూపాలు నిర్మించబడ్డాయని చెబుతారు.
ప్రస్తుతం మనదేశంలో స్థూపాలలో సంపూర్ణ రూపంలో గోచరించేది సాంచీస్తూపం ఒక్కటే. మన రాష్ట్రంలోని నాగార్జునకొండ, అమరావతి స్థూపాలు కూడా ప్రసిద్ధి చెందినవే. ముఖ్యంగా అమరావతిలో లభ్యమైన శిల్పాలను చెన్నై ఎగ్మూరు పురావస్తు ప్రదర్సనశాలలో చూడవచ్చు. నాగార్జునసాగర్ నిర్మాణం అనంతరం ఏకంగా నాగార్జున కొండలోని పురాతన ప్రసిద్ధి చెందిన ప్రాంతం జలసమాధి అయింది. ఫలితంగా బౌద్ధస్తూపమంటే, సాంచీ బౌద్ధస్తూపమే ప్రముఖంగా గోచరిస్తుంటుంది. బౌద్ధ నిర్మాణశైలి, శిల్పకలాశైలిని దర్శించుకోవాలంటే సాంచీకీ వెళ్ళాల్సిందే.
సాంచీలోని మహాస్తుపం మౌర్యచక్రవర్తియైన అశోక చక్రవర్తి వలన నిర్మించబడిందని తెలుస్తోంది. సాంచీతో అశోకునికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన యవ్వనంలో రాజప్రతినిధిగా ఉన్నప్పుడు, సాంచీకి పది కిలోమీటర్ల దూరంలోనున్న విదిశానగరంలోనే ఉన్నాడు. విదిశానగరం నేటి ముంబైనగరం వలె ఆ రోజుల్లో ప్రసిద్ధ వ్యాపారకూడలి. ఆ నగరంలో ఓ వ్యాపార ప్రముఖుని కుమార్తెను అశోకుడు వివాహం చేసుకున్నాడు. వారి సంతానం మహేంద్రుడు, సంఘమిత్ర ఉజ్జియనీ నగరంలో జన్మించారు. మహేంద్రుడు శ్రీలంకకు వెళ్ళేముందు కొంతకాలంపాటు విదిశా నగరంలో వసించాడు.
అశోకుడు కట్టించిన స్తూపం ఇటుకరాళ్ళతో నిర్మించబడి, పైన బంకమన్ను పూయబడింది. ప్రస్తుతము మనం చూస్తున్న స్తూపం 37 అడుగుల చుట్టు కొలతతో, పైనున్న గొడుగుతో కాకుండా స్తూపం ఎత్తు 16 1/2 అడుగుల ఎత్తుతో కనబడుతుంటుంది. అయితే అశోకుడు ఇప్పుడున్న పరిమాణంలో సగం పరిమనంతోనే స్తూపాన్ని నిర్మించాడు. ఈ స్తూపం ప్రక్కన ఎకశిలాస్తంభాన్ని చూడగలం. మౌర్యుల తరువాత రాజ్యాధికారాన్నిచేప్పట్టిన సంగరాజవంశీయులు, స్తూపాన్ని గట్టిరాళ్ళతో రెండింతలు పెద్దదిగా నిర్మింపజేసారు. ఈ స్తూప నిర్మాణంలో అధికంగా పాలుపంచుకున్నది అక్కడున్నబౌద్ధభిక్షువులు, బౌద్ధమత అనుయాయులే. అనంతరకాలంలో స్తూపం చుట్టూ వలయాకారమార్గం, స్తూపాన్ని సగం ఎత్తున ప్రదక్షణామార్గం, శిఖరభాగంపై హార్మిక నిర్మించబడ్డాయి. అనంతరం శాతవాహనులకాలంలో 1,3వ స్థూపాలకు శిల్పకళా శోభితమైన ద్వారతోరణాలు నిర్మించబడ్డాయి. ఇక, గుప్తుల కాలాన్ని చాలామంది చరిత్రకారులు స్వర్గయుగం అని చెబుతుంటారు. ఆకాలంలో సాంచీలో కొత్తకొత్త నిర్మాణాలు, అప్పటికి ప్రాచుర్యంలోకి వచ్చిన బుద్దుని విగ్రహరూపాలు నెలకొల్పబడ్డాయి. చాలా కాలంపాటు బుద్ధునికి విగ్రహరూపం లేదు. ధర్మచక్రం, తామరపువ్వు, ఏనుగు, భోదివృక్షం, సింహాసనం, అగ్నిస్తంభం, పాదముద్రికలు వంటివే అప్పటివరకు బుద్ధునికి గుర్తుగా భావించబడుతూ వచ్చాయి. ఇలా పన్నెండవ శతాబ్దం వరకు సాంచీలో బౌద్ధమతం, కళలు ఎంతో గొప్పగా విలసిల్లాయి. 13వ శతాబ్దం నుంచి సాంచీ గురించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభ్యం కావడంలేదనే చెప్పాల్సి ఉంటుంది. అనంతరం ఆంగ్లేయులు మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత 1818వ సంవత్సరంలో 1,2,3 స్థూపాలను జనరల్ డయ్యర్ కనిపెట్టాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ 2,3 స్తూపాలకు చెందిన పగిలిపోయిన ఫలకాలను కనుగొన్నాడు. అయితే మహాస్తూపం నుంచి ఎటువంటి అస్తిఫలకాలు లభించలేదు. 1912-1919 సంవత్సరం వరకు పురావస్తుశాఖ నిర్వాహకునిగా ఉన్న సర్. జాన్ మార్షల్ అహర్నిశలు కృషి చేసి, సాంచీ, ఆ చుట్టుప్రక్కల అడవులలో నున్న పురాతన చిహ్నాలను వెదకి వెదకి సేకరించి భావి తరాల కోసం భద్రపరిచారు.
బౌద్ధస్తుపం అంటే, దాని పరిమాణం పెద్దదా? లేక చిన్నదా అనే విషయాలు తప్ప వేరే ప్రేత్యకత ఏమి ఉండదు. స్తూపం అంటే ఓ సమాధియే తప్ప మరేమీ కాదు. కానీ, బౌద్ధభిక్షువులకు, అనుయాయులకు అలా కాదు. అవి అత్యంత పవిత్రమైన స్థలాలు. అక్కడ, వారి ఇష్టదైవానికి ఏమైనా చేయాలని ఆశ పడుతుంటారు. అక్కడ నిరంతరంగా ఉండేలా శిలలను చెక్కిస్తుంటారు. కాని, స్తూపంలో అందుకు చోటు ఉండదుగా! అందుకే స్తూపం చుట్టూ తోరణ ద్వారాలను ఏర్పాటుచేశారు. ఈ శిల్పాలను నాల్గు విధాలుగా విభజించవచ్చు. జాతక కథల దృశ్యాలు, బుద్ధుని జీవిత చిత్రణ దృశ్యాలు, బౌద్ధమతంలో ఏర్పడిన పరిణామాలు అంటూ పలురకాలైన దృశ్యశిల్పాలను, రాతి పుష్పాలను, చెట్లను, అలంకారాలను చూడవచ్చు.
ఒక్కొక్క తోరణ ద్వారానికి అటు ఇటు చదరంగా ఉండే రెండు స్తంభాలు. వాటి పైన నాల్గు సింహాలు, లేక నాలుగు ఏనుగులు లేక బానపొట్టతో కూడిన యక్షులు గోచరిస్తుంటారు. వాటిపై అడ్డంగా మూడు రాతి పట్టీలు. అవి అటు ఇటు గుండ్రంగా చుట్టబడినట్లు మలచబడ్డాయి. ఈ తోరణాలు సుమారు ఎనిమిదిన్నర మీటర్ల ఎత్తుంటాయి. కిందఉన్న రాతిపట్టిలో అందమైన యువతులు నాట్యం చేస్తున్నట్లుగా శిల్పాలను మలిచారు. పైన్నున్న రాతి పట్టిపై బుద్దుడు, త్రిరత్నాలు మొదలైన ప్రతిమలున్నాయి. ఉత్తరంవైపున్నున్న తోరణద్వారానికి కాస్తంత కుడా ఖాళీ లేకుండా అలంకార శిల్పాలున్నాయి. సాంచీకి సోబగును చేకూర్చేవి ఈ తోరణద్వారాలే. ఈ తోరణ ద్వారాలలో దేవతలు, మనుషులు, ఏనుగులు, గుర్రాలు, పశువులు, కోతులు అంటూ సమస్త ప్రకృతినే చూస్తున్నాం.
నాలుగు తోరణ ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించి మెట్ల పైకెక్కినప్పుడు, మనకు ఎదురుగా కనిపించేది మహా స్తూపం యొక్క ఉత్తరద్వారం. నాలుగు ద్వారాలలో ఈ ద్వారమే చాలా అందంగా తీర్చిదిద్ధబడింది. అశోకుని కాలంలో అక్కడక్కడా బౌద్ధ స్తూపాలు నిర్మించబడి, పండితులుతో పాటు పామరులు కూడా బౌద్ధమతం పట్ల ఆకర్షితులయ్యేల చేయబడింది. ఆ స్తూపాలలో అన్ని మతాలకు చెందిన చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా స్తూపాలను పూజించడం ఈ జనానికి అలవాటైంది. ఆ స్థూపాలలోవున్న యక్ష, యక్షిణి, వనదేవాతలు, నాగాదేవాతలు, నదీ దేవతలు మరియు చెట్టూచేమా, పుష్పాలు, మృగాలను చూసిన ప్రజలు బౌద్ధమతంతో మమేకమైపోయారు.
ఒకటవస్తూపం : ఇది మౌర్యచాక్రవర్తి అశోకుని కాలంలో నిర్మించబడింది. అండాకారంలో నిర్మించబడిన ఈ స్తూపం, మౌర్యులకాలంలో ఇప్పుడున్న దానిలో సగం వంతులో కట్టబడింది. అనంతరం ఈ స్తూపం సంగ వంశ రాజులకాలంలో సున్నపురాయితో భారీగా నిర్మించబడినది. అండాకారంలో నిర్మించబడిన ఈ స్తూపం పైభాగం చదరంగా నిర్మించబడి, దానిపై ‘ హార్మిక ’ అనే పెట్టె వంటి భాగం, ఆ పెట్టె మధ్యభాగంలో ఓ స్తంభం, స్తంభంపై గొడుగువంటి భాగం రూపుదిద్దబడింది. ఈ పెట్టెభాగంలో బుద్ధుని ఆస్తికలను ఉంచారట. అయితే ప్రస్తుతం అటువంటి అనవాళ్ళేమీ లేవు. ఈ స్తూపానికి రెండు ప్రదక్షిణా మార్గాలున్నాయి. దీనికొక అందమైన తోరణ ద్వారం ఉంది.
రెండవస్తూపం : ఇది ఒకటవ స్తూపానికి 320 మీటర్ల దూరంలో ఉంది. దీనిపైన ‘హార్మిక’ అనే పెట్టె, గొడుగుల వంటివి లేవు. దీనికి చుట్టూ ప్రదక్షిణా మార్గాలు ఉన్నప్పటికీ, తోరణద్వారం లేదు.
మూడవ స్తూపం : ఇది ప్రధాన స్తూపానికి సుమారు 60 మీటర్ల దూరంలో ఉంది. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉన్నపటికీ మొదటి స్తూపాన్ని గుర్తుకు తెస్తుంటుంది. ఇంచుమించు మొదటి స్తూపంలానే నిర్మించబడింది.
తోరణాలు : సాంచీ స్తూపాలనగానే మనకు తోరణాలు కూడా గుర్తుకొస్తుంటాయి. తోరణాలు లేని స్తూపాలను ఊహించలేము. వీటిలో చాలామటుకు శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయని ప్రతీతి. వీటిపై జాతక కథలు మలచబడ్డాయి. ఓ రాజు ఊరేగింపుగా వస్తుండటం, రైతు పొలంలో పని చేస్తుంటే, అతని భార్య తలపై పాత్రతో ఆహారాన్ని తీసుకోని వస్తుండటం, ఆరు తొండాల ఏనుగు అంటూ ఒక్కొక్క స్తూపం, అనేక కథా దృశ్యాలను మన ముందు ఉంచుతుంటుంది. ఒక విధంగా ఈ తోరణాలను రాతిపుస్తకాలు అని అనవచ్చు. మచ్చుకు ఓ కథ :
“పూర్వం బోధిసత్త్వుడు ఎనిమిదివేల కోతులకు రాజుగా కోతిజన్మను ధరించాడు. బోధిసత్త్వుని పరిపాలనలో కోతుల్లన్ని గంగానది ఒడ్డున్నున్న మామిడితోపులలో జీవిస్తూ, తియ్యతియ్యగా ఉండే మామిడి పండ్లను భుజిస్తూ ఆనందమయ జీవితాన్ని గడుపుతుండేవి. ఈ తీపి మామిడిపండ్లను గురించి కాశీరాజు బ్రహ్మదత్తునకు తెలిసింది. ఆ తీపి మామిడి పండ్లు తినాలన్న ఆకాంక్షతో తన సైనికులతో ఆ మామిడి తోపును ముట్టడించాడు. రాజు, అతని సైనికులు కంటికి కనబడిన కోతులను బాణాలతో వధించడం ప్రారంభించారు. కోతులను కాపాడాలనుకున్న కోతులరాజు ఓ వెదురుబొంగును గంగానదికి అడ్డంగా వేసి కోతులను రక్షించాలనుకున్నాడు. కానీ, ఆ వెదురు బొంగు పొడువు గంగకు అడ్డంగా వేసినపుడు కొంత తగ్గింది. దాంతో బోధిసత్త్వుడు వెదురుబొంగును గంగకు అవతలి వైపునున్న చెట్టుకు కట్టి, ఇటుప్రక్క తను ఒక వెదురు బొంగులా అడ్డంగా పడుకున్నాడు. అలా తన వారిని సురక్షితంగా దాటావేసాడు. ఇదే అదను అనుకున్న శత్రురాజు అతనిపై దండెత్తగా, తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్న బోధిసత్త్వుడు శత్రువుకే ధర్మబోధ చేసాడు.”
సాంచీ అంటే స్తుపాలే కాదు, నాటి రోజుల్లో ఈ ప్రాంతము గుడులకు, బౌద్ధారామాలకు, ప్రసిద్ధి చెందింది. అయితే అవన్ని ధ్వంసమై, ప్రస్తుతం పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో పరామర్శించబడుతున్నది. ఈ స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాయసేజ్ జిల్లాలో ఉంది. ఇది భోపాల్ నగరానికి సుమారు 46 కి.మీ. దూరంలో ఉంది. రైలు మార్గంలో విదిశ, లేక ఇండోర్ నగరాలకు చేరుకొని అక్కడ్నుంచి బస్సులో సాంచీకి చేరుకోవచ్చు.

వృక్షో రక్షతి రక్షితః
చెట్లను మనం కాపాడితే అవి మనలను కాపాడతాయని మన పెద్దలవాక్కు. అందుకే
‘వృక్షో రక్షతి రక్షితః’ అని అన్నారు. మన సంస్కృతీ ప్రకృతితో మమేకమైనది. మన
పూజావిధానాలను పరిశీలించితే, లేక పురాణాలను పఠించితే ప్రకృతికీ మనకు మధ్య
గల అవినాభావ సంబంధాన్ని తేటతెల్లం చేసే విదానంగానే ఉంటుంది.
ఉదాహరణకు మన పురాణాలనే తీసుకుందాం. అడవులు కూడ నివాసయోగ్యాలుగానే చిత్రీకరించబడ్డాయి. ఋషులు తమ ఆశ్రమాలను అటవీప్రాంతాలలోనే నిర్మించుకున్నారు. శ్రీరాముడు. ధర్మరాజు వంటి వారు అష్టైశ్వర్యాలను త్వజించి వెళ్ళింది అడవులకే. ఈ నేపధ్యంలో మన పురాణాల్లో నైమిశారణ్యం, దండకారణ్యం, తాతకవనం, ఖాండవవనం, హిండింబవనం వంటి అరణ్యప్రాంతాలను చూడగలం. ఒక్కొక్క వనానికి ఒక్కొక్క ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయా వనాలలో నున్న చెట్లను గురించి, ఆ చెట్ల యొక్క ఔషధ గుణాలను గురించి ఆయా పురాణాలలో విపులీకరించబడింది.

నైమిశారణ్యం
మన పూర్వీకులకు ప్రకృతి పట్ల, వృక్ష, జంటజాలాల పట్ల ఎనలేని
అభిమానం. ఆరోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీప్రాంతం నైమిశారణ్యం.
ఇక్కడే సప్తఋషులు వేదాలను వల్లించారు. ఈ వనంలోనే వాల్మీకి మహర్షి రామాయణ
గ్రంథానికి రూపకల్పన చేసాడు. వినాయకుడు రాస్తుండగా, వ్యాసమహర్షి మహా
భారతాన్ని చెప్పింది నైమిశారణ్యంలోనే, భాగవతం కూడా చెప్పబడింది ఇక్కడే.
ఇక్కడే సూట మహర్షి భాగవత గాథను చెప్పాడు. అందుకే నైమిశారణ్యంలోని ప్రతి
చెట్టు యొక్క ఆకులు భాగవత శ్లోకాలను వల్లించుతాయని ప్రతీతి.
“మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రకృతికి మనకు మధ్య
ఉన్న అనుబంధాన్ని గురించి వివరంగా చెబుతుంటాయి. ‘ఓషధిభ్యాః అన్నమ్, అన్నాత్
పురుషాః’ అని త్తెత్తీరీయోపనిషత్ చెబుతోంది. అంటే, అన్నం నుంచి పురుషుడు
అంటే జీవుడు పుట్టి, తనకు కావలసిన ఆహారాన్ని మొక్కలు, చెట్ల నుంచి
గ్రహిస్తున్నాడని అర్థం. ఈ నేపథ్యంలో మన పురాణాలను పరికించినపుడు, మనవాళ్ళు
ప్రకృతినే పరమాత్మగఅ కొలుచుకుంటున్న విషయం తేటతెల్లమవుతుంది.”
అసలు నైమిసారణ్యాన్ని విష్ణుమూర్తి ఒక నిముష మాత్రములో తన
సంకల్పమాత్రం చేత ఈ అరణ్యాన్ని సృష్టించాడని కథనం. ఈ అరణ్యంలోనుంచి
ప్రవహిస్తున్న గోమతీ నది అనేక మూలికలతో కూడుకుని ఉంటుందట. ఈ నదిని ఆదిగంగ
అని పిలుస్తుంటారు. శ్రీరామచంద్రుడు ఇక్కడ తన పితృదేవతలకు పూజలు చేసాడట.
వృతాసురుని సంహరించేందుకు ఈ నైమిశారణ్యంలోనే దధీచి తమ ఎముకులను వజ్రాయుధం
తయారీకోసం బహుకరించాడు. ఇలా నైమిశారణ్యం మన పురాణాలలో గోచరిస్తుంటుంది.
దండకారణ్యం
శ్రీరాముడు వనవాసాన్ని చేయడానికి సంకల్పించినప్పుడు, ఆయన
వెళ్ళాలనుకున్నది దండకారణ్యానికే. ఈ అడవిలోనే సీతారామలక్ష్మణులు ఎక్కువ
వనవాస సమయాన్ని గడిపారు. సీతారామదంపతులకు అడవిలో జీవనాన్ని ఎలా గడపాలన్న
విషయాలను అత్రిమహర్షి – అనసూయాదేవిలు తెలిపారట. ఇక్కడ ఐదు వృక్షాల మధ్య
లక్ష్మణునిచే నిర్మించబడిన ‘పంచవటి’ సీతారాములకు స్వర్గం కంటే విలువైనది.
అయితే ఈ దండకారణ్యం ఓ పాపాత్ముని వలన ఏర్పడినదని ఉత్తర
రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం ఇక్ష్వాకుని పుత్రులలో దండుడు అనే
కడపటి కొడుకు ఉండేవాడు. దండుడు చిన్నప్పట్నుంచి కడు దుర్మార్గుడు. తన
బాల్యంలో అనేకమంది బాల్యమిత్రులను చంపుతుండేవాడు. అతని ఆగడాలను
భరించలేకపోయిన ఇక్ష్వాకుడు దండుని వింధ్యపర్వతాల అవతలకు తరిమేశాడు.
అక్కడికి వెళ్ళిన దండుడు మధుమంతపురం అనే నగరాన్నినిర్మించి పరిపాలన
చేయసాగాడు. అనంతర కాలంలో శుక్రుని వద్ద శిష్యకరం చేసిన దండుడు, ఒకరోజు
శుక్రుని కూతురు అరజను బలాత్కరించాడు. అరజతను గురువు కూతుర్ని కనుక, అతనికి
చెల్లెలి వరుస అవుతానని, ఇటువంటి దుర్మార్గం తగదని బ్రతిమాలుకున్నప్పటికీ,
దండుని అకృత్యం ఆగలేదు. ఈ వార్తను విన్న శుక్రుడు ఆగ్రహంతో దండుడు
రాజ్యంపై మట్టి వాన కురిసి, అతని రాజ్యమంతా భూస్తాపితమైపోవాలని శపించాడు.
వెంటనే మధురమంతపుర రాజ్యం మట్టి వర్షంలో మునిగిపోయి, కొంతకాలం తర్వాత ఆ
మట్టిపై దట్టమైన అడవి ఏర్పడి దండుని పేర దండకారణ్యం అని పిలువబడింది.
కాబట్టి ఇక్కడ మనకు ఓ విషయం స్పష్టమవుతోంది. ఋషులు ఓ దుర్మార్గుని
శపిస్తున్న సమయములో కూడ ఆ శాపం ప్రకృతికి పరిరక్షణకు అనుకూలంగా ఉండేట్లుగా
చూసుకున్నారన్నవిషయాన్ని మానమ గ్రహించాలి.
తాటకవనం
రామాయణంలో దండకారణ్యంతో పాటు మరో ప్రసిద్ధమైన వనం ఉండేది.
అదే తాటకవనం. పూర్వం తాటక అనే రాక్షసి అడవిలో తనకు కనబడిన మనుషులను తింటూ, ఆ
అడవినంతా ధ్వంసం చేస్తుండేది. చివరకు ఆ రాక్షసి విశ్వామిత్రుడు దశరథుని
అనుమతితో బాల రామలక్ష్మణలను ఆశ్రమానికి తీసుకెళ్తుండగా, తాటక ఎదురైంది. అలా
తనకు ఎదురుపడిన తాటకను బాలరాముడు ఒక్క బాణంతో సంహరించాడు. అప్పుడా రాక్షసి
శాపవిమోచనం పొంది, గాంధర్వకన్యగా మారిపోతుంది. తానూ అగస్త్యుని వలన
శాపానికి గురైయ్యానని, తనకు శ్రీరాముని వలన శాపవిమోచనం కలిగినందుకు జన్మ
సాఫల్యమైందనిచెబుతూ, తన లోకానికి వెళ్ళిపోతుంది.
ఇక మహాభారతం, భాగవతంలో కూడ అనేక అరణ్యాల ప్రసక్తులు ఉన్నాయి.
గురుదేవోభవ
నమో వై బ్రహ్మవిధయే వాసిష్ఠాయ నమోనమః
వేదమూర్తియైన వశిష్ఠుని వంశంలో జన్మించిన మహామునే విష్ణువు. విష్ణువే వేదవ్యాస మహాముని. అట్టి మహానీయునికి నమస్కారం.
పరాశరులు వేదవతిని వివాహమాడినపుడు శ్రీమహా విష్ణువు నీ కుమారునిగా నేను జన్మించగలనని తెల్పాడు. ఆ కారణంతో ఆయనే వ్యాసమహర్షియై జన్మించాడు. నాది సాధారణమైన మానవజన్మ కాదని నిర్థారించుటకుగాను పుట్టిన వెంటనే ఏడు సంవత్సరాల బాలునివలె రూపొందాడు. నదీ మధ్యమున నల్లనివాడుగా జన్మించటం వలన ఈయనకు కృష్ణాద్వైపాయనుడు పేరుకూడా వుంది.
వేదాలు ఆపౌరుషేయాలు, భగవద్దతములు, వాటిని పరిష్కరించి రుగ్యజుస్సామాధర్వణ వేదాలుగా లోకానికి అందించిన పరబ్రహ్మస్వరూపుడైన ప్రథమగురువు వేద వ్యాసమహర్షి.
ఆయన ఉపనిషత్తుల తత్వాన్ని, భారత, భాగవతాలను, భారతంలో ప్రధానంగా భగవద్గీతను, అష్టాదశపురాణాలను ఇంకా ఎన్నో తాత్విక శాస్త్ర గ్రంథాలను రచించి ప్రపంచానికందించి భారతదేశ తాత్వికత ప్రపంచదేశాలలో మకుటాయమానమైనదని తలంపజేసారు.
లోక కల్యాణానికి మహాత్ములు జన్మిస్తారు. సకలజనుల శ్రేయస్సుకై తమ మనుగడను సాగించి చరితార్థులౌతారు. శ్రీ వ్యాస భగవానుడు దైవకార్యాన్ని నిర్వహించే దానికిగాను జన్మించిన దినమే ఆషాఢపూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమ అని, గురుపూర్ణిమ అని కూడా అంటారు ఆ రోజున దేశంలోని గురువులందరు పూజింపబడతారు. ఉత్తమగురువులు త్యాగధనులు కావున కాషాయ వస్త్రాలను ధరించి నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తారు.
“గు" శబ్దం అంధకారానికి పేరు. “రు” శబ్దము దాని నివాసనం జేయు ప్రకాశం. అనగా అజ్ఞానమనెడి చీకటిని ప్రారద్రోలి స్వయం ప్రకాశకమగు పరబ్రహ్మమును తెలియ జేయునది అని అర్థం.
జననీజనకులు శరీరమిచ్చి పోషించి, కాపిడినవారు. వారని జ్ఞప్తియందు ఉంచుకొని కృతజ్ఞతాభావంతో మేలగుతుంటాము. అదేవిధంగా సోదరులు, స్నేహితులు, బంధువులు మానసిక, సాంఘిక బందుత్వంగల వారు గావున వారితో మర్యాద, మన్ననలతో నడచుకుంటూ ఉంటాము. వీరందరితోడి సంబంధము వ్యక్తీ జీవించి ఉన్నంతవరకే, కాని గురువుతోడి సంబంధం ఇలాంటిది కాదు. అది ఆధ్యాత్మికమైనది. అతడు తన శిష్యుని తరింపజేయునట్టి మహత్వమును ప్రసాదించినాడు. కాబట్టి, అందరి కంటే గురువు ఉన్నతమైనవాడుగా గుర్తింపబడ్డాడు.
ప్రతివారికి మొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత విద్యనభ్యసింపజేసినా గురువు. ఈ గురువులో దైవత్వాన్ని చూడాలన్న భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పది. పెద్దలను, గురువులను, మహాత్ములను దర్శించినపుడు మనం రెండు చేతులులను జోడించి నమస్కరిస్తాం. ఆ నమస్కారానికి అత్యున్నమైన అర్థముంది. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయమని దాని భావనం. మన సంస్కారానికి ప్రతిగా గురువు అభయముద్రను ప్రసాదిస్తాడు. అదే గురవు అనుగ్రహం. అదివుంటే జీవితం చరితార్థమైనట్లే. అంతకంటే జీవితంలో కోరదగిందేమిలేదు.
సద్గురువు శాస్త్ర విజ్ఞానంలో దిట్టగా, నిష్కళంక చరిత్ర గలవాడుగా, కామక్రోధాది అరిషడ్వర్గాలకు దూరుడైన వాడుగా, నిశ్చలస్థితిని పొందినవాడుగా, సత్య దయా శౌచములను కలిగినవాడుగా, తనను ఆశ్రయించినవారికి ఆప్తుడుగా వుండాలి. అతడు నిరంతరం శిష్యులకు దైవ సాక్షాత్కార మార్గమును ఉపదేశిస్తూ, దివ్యజీవనమునే గడుపుతుండాలి. ఇదే సద్గురువు లక్షణం.
గురువు ఆశ్చర్యాన్ని కలిగించేతంతటి మేధాశక్తిని కలిగియుండి, శిష్యుడు కాదు నేర్పరియైనపుడు గురుశిష్యసంబంధం విజ్ఞానవంతంగాను, వర్ణనాతీతంగాను ఉంటుంది. గురువు జ్ఞాని కాకపొతే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించినవిధమే ఔతుంది. కళ్ళకు గంతలు కట్టుకోన్నవాడు ఇంకొకడి కళ్ళ గంతలను ఎలా విప్పి దారి చూపగలడు? కావున గురువు ఆత్మజ్ఞానియై ఉండాలని భావం. వాస్తవానికి గురువు ఏదో ఒక విషయాన్ని బోధించు వాడై ఉండరాదు. అతడు కేవలం విద్యాబోధన చేయు వాడుగాడు. అతని సంబంధం ఆత్మా పర్మాత్మలకు చెందినట్టిది. విద్యనూ నేర్చుకొన్నా, నేర్చు కొనకపోయినా ఆత్మజ్ఞానాన్ని మాత్రం పొందాలి. ఆ లక్ష్యాన్నినెరవేర్చు వాడెవరో అతడే నిజమయిన గురువు. గురువు ద్వారా ఆత్మజ్ఞానమును పొందినవాడే నిజమైన శిష్యుడు.
గురవు లేకపోయినా జ్ఞానం కలగటం అసంభవం. భారతదేశంలో మహాత్ములందరికి గురువులున్నారు. శ్రీరామునకు, శ్రీకృష్ణునికి గురువులున్నారు. అదేవిధంగా శ్రీశంకరులు, శ్రీరామకృష్ణులవారికీ గురువులున్నారు. వారు సహజంగానే సద్గురువులు. కాని, వారు గురువులను ఆశ్రయించే జ్ఞానాని పొందారు. పూర్ణత్వమును పొందినట్టివారికి గురువు అవసరం లేదు, కాని అట్టివారెవారని చెప్పగలం?
నీవు చదివిన విద్య ఎట్టిదో తెలుపమని తండ్రియగు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని అంటాడు. చదువులలో మర్మమంటే ఏమిటి? అదే ఆత్మజ్ఞానం. “అహం బ్రహ్మస్మి”. తానూ శరీరం కాదు “ఆత్మ” అనే జ్ఞానాన్ని పొందడం. నీవు ఇప్పుడు అహంకారాన్ని వదిలి భగవంతుని శరణాగతి వేడితే నీలో ఉన్న ఆత్మయే సద్గురు రూపంలో ప్రత్యక్షమౌతాడు.
గురుపూర్ణిమ నుండే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమౌతుంది. సద్గురువులు వ్రత దీక్షపూని తమ శిష్యులకు మార్గదర్శకులౌతారు. గురుశిష్య సాంప్రదాయం చాలగోప్పది. ఒక గురువువద్ద తయారైన సత్య నిష్ఠ గల శిష్యుడు, మరికొంతమంది శిష్యులకు గురువై సద్గురు సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు.
నమోస్తు గురవే తస్మై! ఇష్ట వేద స్వరూపిణే
యస్యవాక్యామృతం హంతి విషసంసారి పంజ్కిలం
ఎవరి అమృతవాక్కువల్ల సంసారమనే విషం నుండి తరుణోపాయంలభిస్తుందో, ఆగురువుకు నమస్కారం. సద్గురువు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. ఆయన ప్రక్కన భగవంతుడే నిల్చున్నా ప్రథమ నమస్కారం సద్గురువుకేనంటాడు కబీరుదాసు.
No comments:
Post a Comment